News December 23, 2024
అతిగా నీరు తాగి ICUలో చేరిన మహిళ
‘అతి’ అనర్థాలకు దారి తీస్తుందట. ఓ మహిళ విషయంలోనూ అదే జరిగింది. నిద్ర లేవగానే 4 లీటర్ల నీరు తాగిన ఓ 40ఏళ్ల మహిళ కొన్ని రోజుల పాటు ఆస్పత్రి పాలైంది. నీరు తాగిన గంటలోనే హైపోనాట్రేమియా(రక్తంలో సోడియం గాఢత తగ్గడం)తో ఆమెకు తలనొప్పి, వికారం, వాంతులు వచ్చాయి. కొన్ని నిమిషాల తర్వాత ఆమె స్పృహ కోల్పోగా ICUలో చికిత్స పొందారు. రోజుకు 2.5-3.5 లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు సూచించారు.
Similar News
News December 23, 2024
బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్వాగతించిన ఫిల్మ్ ఎగ్జిబిటర్లు
TG: బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే, సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు.
News December 23, 2024
మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
TG: మోహన్బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు మోహన్బాబును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
News December 23, 2024
ఏడాదిలో ₹16 నుంచి ₹1702కు పెరిగిన షేర్లు.. సస్పెండ్ చేసిన సెబీ
భారత్ గ్లోబల్ డెవలపర్స్ (BGDL)పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అవినీతి, అవకతవకలకు పాల్పడుతోందన్న ఫిర్యాదులు రావడంతో షేర్ల ట్రేడింగును నిలిపివేసింది. 2020, జులై వరకు ఐదుగురు ప్రమోటర్లకు 16.77% (93,860 షేర్లు) వాటా ఉండగా ప్రస్తుతం 100% పబ్లిక్ వద్దే ఉన్నట్టు సెబీ గమనించింది. ఆస్తులు, అప్పులు, ఖర్చులు పెంచి చూపినట్టు కనుగొంది. 2024 ఆరంభంలో రూ.16గా ఉన్న ఈ షేర్లు 105 రెట్లు పెరిగి రూ.1702కు చేరాయి.