News January 27, 2025
సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో మహిళ అరెస్ట్

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో ఓ మహిళ అరెస్టైంది. పశ్చిమ బెంగాల్‌లోని నాదియా జిల్లాలో ఆమెను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ వాడిన సిమ్ ఈ మహిళ పేరు మీద రిజిస్టరై ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ముంబై తీసుకెళ్లి విచారించేందుకు ఆ రాష్ట్ర పోలీసుల అనుమతి తీసుకోనున్నారు. సైఫ్‌పై తన ఇంట్లోనే ఈ నెల 16న దాడి జరిగిన విషయం తెలిసిందే.
Similar News
News October 17, 2025
సంస్కరణలతోనే ఉజ్వల భవిష్యత్తు: CBN

AP: భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని CM CBN అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. నాటిన కొంతకాలానికి చెట్లు ఫలాలు అందిస్తాయని, అదే మాదిరి సంస్కరణలు కూడా కొన్నిరోజుల తర్వాత ప్రజలకు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయని వివరించారు. GST 2.0పై నిర్వహించిన పోటీల్లో గెలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. సంస్కరణల ప్రయోజనాల గురించి వారిని అడిగారు.
News October 17, 2025
కాంగ్రెస్ అభ్యర్థికి AIMIM మద్దతు

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు AIMIM చీఫ్ అసదుద్దీన్ మద్దతు తెలిపారు. ఎన్నికల్లో నవీన్ గెలిచి జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాలను కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయన్నారు. అంతకుముందు నవీన్ నామినేషన్ దాఖలు చేశారు.
News October 17, 2025
నారాయణమూర్తి దంపతులపై సిద్దరామయ్య ఫైర్

సామాజిక సర్వేపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి దంపతుల <<18022008>>కామెంట్స్‌పై<<>> కర్ణాటక CM సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది వెనుకబడిన కులాల సర్వే కాదని 20 సార్లు చెప్పాం. వారికి అర్థం కాకపోతే నేనేం చేయాలి. ఇన్ఫోసిస్ ఉందని వారికి అన్నీ తెలుసనుకుంటున్నారా? ఇది పూర్తిగా పాపులేషన్ సర్వే. మరి కేంద్రం చేపడుతున్న సర్వేపై ఏమంటారు?’ అని ప్రశ్నించారు. అటు సర్వేపై ఎవరినీ బలవంతం చేయమని Dy.CM శివకుమార్ అన్నారు.