News March 21, 2025
76 ఏళ్ల వయసులో తల్లయిన మహిళ

ఇథియోపియా దేశంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. మెకెల్లే ప్రాంతానికి చెందిన మెధిన్ హాగోస్ అనే మహిళ 76 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చారు. తాను సహజ పద్ధతిలోనే గర్భం దాల్చినట్లు ఆమె సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుండగా, ఇంత లేటు వయసులో సహజంగా గర్భం దాల్చడం సాధ్యం కాకపోవచ్చని పలువురు నెటిజన్లు అంటున్నారు. IVF విధానంలో ప్రెగ్నెంట్ అయ్యుంటారని కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News December 24, 2025
కన్నప్రేమ నేర్పిన నాయకత్వం: సత్య నాదెళ్ల విజయ రహస్యం

మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల నాయకత్వ శైలి మారడానికి ఆయన పిల్లలే ప్రధాన కారణం. పుట్టుకతోనే ప్రత్యేక అవసరాలున్న తన పిల్లలను చూశాక లోకాన్ని చూసే కోణం మారిందన్నారు ఆయన ఓ సందర్భంలో. ఎదుటివారి కష్టాన్ని అర్థం చేసుకునే గుణం నాయకుడికి ఉండాలని గ్రహించారు. ముఖ్యంగా అంగవైకల్యం ఉన్నవారికి సాంకేతికత అందాలనే లక్ష్యంతో పనిచేశారు. తన పిల్లల వల్ల కలిగిన ఈ అనుభవాలే ఆయన్ను గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాయి.
News December 24, 2025
యాసంగి అవసరాలకు యూరియా సిద్ధం: మంత్రి తుమ్మల

తెలంగాణలోని రబీ సీజన్ అవసరాల కోసం ఇప్పటికే 5 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వచ్చే జనవరి, ఫిబ్రవరి అవసరాలకు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆదిలాబాద్, జనగామ, మహబూబ్‌నగర్, నల్గొండ, పెద్దపల్లి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా యూరియా యాప్ అమలు చేస్తున్నామని, 2 రోజుల్లోనే 19,695 మంది రైతులు 60,510 యూరియా బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు.
News December 24, 2025
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం మరమ్మతులపై ముందడుగు

TG: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఏర్పడిన పగుళ్లు, ఇతర లోపాల మరమ్మతులకు ముందడుగు పడింది. ఈ బ్యారేజీలపై డీపీఆర్‌ను ప్రభుత్వం సిద్ధం చేయిస్తోంది. ఈ పనిని ఆర్వీ అసోసియేట్స్‌కు అప్పగిస్తోంది. అటు తుమ్మిడిహట్టి DPRను కూడా ఇదే సంస్థ రూపొందిస్తోంది. ఈ రిపోర్టును 3నెలల్లో అందించాలని గడువు విధించింది. ఇది రాగానే పనులకు టెండర్లు పిలిచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.


