News March 9, 2025

రైలులో ప్రసవించిన మహిళ

image

ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఓమహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. రైలులో ప్రయాణిస్తున్న మహిళకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ఇది గమనించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికుల సహాయంతో డెలివరీ చేశారు. అనంతరం మథుర స్టేషన్‌లో తల్లి బిడ్డలకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఇద్దరు సురక్షితంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ Xలో పోస్ట్ చేసింది.

Similar News

News April 2, 2026

నేడు రాజ్యసభకు అమరావతి బిల్లు

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుకు నిన్న లోక్‌సభలో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం లాంఛనమే కానుంది. అనంతరం బిల్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వద్దకు వెళ్తుంది. ఆమె ఆమోదముద్ర వేయగానే చట్ట రూపం దాలుస్తుంది. దీంతో ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతి నిలిచిపోనుంది.

News April 2, 2026

ఆర్టెమిస్-2: చంద్రుడి కక్ష్యలోకి స్మార్ట్‌ఫోన్లు..

image

NASA చేపట్టిన ఆర్టెమిస్-2 <<19542665>>యాత్ర<<>> రికార్డులు సృష్టిస్తోంది. ఇది అపోలో-13 కంటే 3,345 మైళ్లు ఎక్కువ దూరం ప్రయాణించనుంది. అలాగే చంద్రుడి కక్ష్యలోకి వెళ్తున్న తొలి మహిళగా క్రిస్టినా కోచ్ చరిత్రకెక్కనున్నారు. రెండు మినీ వ్యాన్ల పరిమాణంలో ఉండే ఓరియన్ నౌకలో నలుగురు వ్యోమగాములు తమ వెంట స్మార్ట్‌ఫోన్‌లు తీసుకెళ్తుండటం విశేషం. 10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో వీరు నింగి నుంచి సూర్య గ్రహణాన్ని వీక్షించనున్నారు.

News April 2, 2026

ట్రంప్ ప్రకటన.. భారీగా పెరిగిన క్రూడాయిల్ ధర

image

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ <<19543167>>ప్రకటన<<>> నేపథ్యంలో క్రూడాయిల్ ధర భగ్గుమంది. బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతం పెరిగి 105 డాలర్లకు చేరింది. అలాగే WTI బ్యారెల్ చమురు రేట్ 3 శాతం ఎగసి 103 డాలర్లుగా ఉంది. ఇక ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లాయి. ఈ ప్రభావంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయే ఛాన్స్ ఉంది. అటు బంగారం, వెండి ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.