News January 28, 2025

‘మ్యాన్ ఈటర్’ పొట్టలో మహిళ వెంట్రుకలు, రింగులు

image

కేరళలోని వయనాడ్‌లో రాధ (45) అనే మహిళను తిన్న ‘మ్యాన్ ఈటర్’ పొట్టలో ఆమె అవశేషాలు కనిపించాయని అధికారులు నిర్ధారించారు. పోస్టుమార్టంలో ఆమె వెంట్రుకలు, చెవి రింగులు పులి పొట్టలో లభించినట్లు తెలిపారు. పులి కోసం అటవీ అధికారులు వేటాడుతుండగా ఓ పాడుబడిన ఇంట్లో చనిపోయి కనిపించింది. వెంటనే దానికి పోస్టుమార్టం నిర్వహించారు. టీమ్ ఇండియా క్రికెటర్ మిన్ను మణికి మృతురాలు రాధ సమీప బంధువు అన్న విషయం తెలిసిందే.

Similar News

News October 24, 2025

పొలిటికల్ టర్న్ తీసుకున్న వైద్యురాలి ఆత్మహత్య కేసు

image

MHలో సంచలనం రేపిన వైద్యురాలి <<18091644>>ఆత్మహత్య<<>> కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. పోస్టుమార్టమ్ రిపోర్ట్‌ను ‘మేనేజ్’ చేయాలంటూ డాక్టర్‌పై ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు రాజకీయ నేతలు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు మండిపడుతున్నారు. అటు CM ఫడణవీస్ ఆదేశాలతో ప్రధాన నిందితుడు SI గోపాల్‌ను సస్పెండ్ చేశారు.

News October 24, 2025

మ్యాచ్ రద్దు.. WCలో పాక్‌కు ఘోర అవమానం

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఇవాళ పాక్, శ్రీలంక మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాక్ బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే భారీ వర్షం పడగా అంపైర్లు మ్యాచ్‌ రద్దు చేశారు. అంతకుముందే ఇరు జట్లు సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. మొత్తం 7 మ్యాచ్‌ల్లో పాక్ ఒక్కటీ గెలవలేదు. 4 మ్యాచ్‌ల్లో ఓడిపోగా 3 రద్దయ్యాయి. దీంతో ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవని ఏకైక జట్టుగా ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.

News October 24, 2025

చిన్న కాంట్రాక్టర్లకు తీపి కబురు

image

TG: ఆర్‌అండ్‌బీ చిన్న కాంట్రాక్టర్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపి కబురు అందించారు. సీఎం రేవంత్‌తో మాట్లాడి రూ.100 కోట్ల పెండింగ్ బిల్లుల పేమెంట్‌కు కృషి చేసినట్లు వివరించారు. మిగతా రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు కూడా త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేసిన సీఎం, మంత్రికి రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలిపింది.