News March 26, 2024
మహిళలు పొగ మానలేకపోతున్నారు.. కారణమిదే!

మోడ్రన్ కల్చర్‌లో పురుషులతో సమానంగా మహిళలు పొగ తాగుతున్నారు. అయితే మానేయడానికి మాత్రం మగాళ్లతో పోలిస్తే స్త్రీలకు కష్టంగా ఉంటోందని కెంటకీ యూనివర్సిటీ(US) అధ్యయనంలో తేలింది. నికోటిన్‌కు అడిక్ట్ కావడానికి మహిళల్లోని సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ కీలక పాత్ర పోషిస్తుందట. ఏదైనా కావాలనుకునే ఆశను వ్యక్తీకరించే మెదడులోని ఒల్ఫాక్టోమెడిన్ ప్రోటీన్ కూడా వ్యసనానికి కారణమని వెల్లడైంది.
Similar News
News February 13, 2026
ఈ సెంటిమెంట్ రిపీటైతే టీ20 వరల్డ్ కప్ ఇండియాదే!

జింబాబ్వే సంచలన విజయం టీమ్ఇండియా అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 1983 ODI WC, 2007 T20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడు భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లోనూ జింబాబ్వే ఆసీస్‌ను చిత్తు చేయడంతో ఆ అరుదైన ‘సెంటిమెంట్’ రిపీట్ అవుతుందని గూగుల్ ఇండియా విశ్లేషించింది. ఈ లక్కీ ఫ్యాక్టర్ నిజమైతే SKY సేన కప్పు గెలవడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
News February 13, 2026
ఈ విజయం మా బాధ్యతను పెంచింది: రేవంత్

TG: మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్‌కు విజయాన్ని కట్టబెట్టారని ప్రజలకు CM రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రెండేళ్ల పాలన, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ తీర్పుతో సంపూర్ణ ఆమోదం తెలిపారని ట్వీట్ చేశారు. ఇది తమ బాధ్యతను మరింత పెంచిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీలను గొప్పగా అభివృద్ధి చేసి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం చేస్తున్నామన్నారు.
News February 13, 2026
వైట్ కాలర్ జాబ్స్‌ను AI భర్తీ చేస్తుంది: మైక్రోసాఫ్ట్ AI చీఫ్

రాబోయే 12 నుంచి 18 నెలల్లో కంప్యూటర్ ఆధారిత ‘వైట్ కాలర్’ ఉద్యోగాలను AI భర్తీ చేస్తుందని మైక్రోసాఫ్ట్ AI చీఫ్ ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. ముఖ్యంగా అకౌంటింగ్, మార్కెటింగ్, లీగల్, డేటా ఎంట్రీ వంటి పనులు ఆటోమేషన్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల పని వేగం, ఉత్పాదకత పెరిగినప్పటికీ ఉపాధి రంగంలో పెను మార్పులు వస్తాయని ఆయన విశ్లేషించారు. టెకీలు తమ నైపుణ్యాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.


