News September 24, 2025
సాహసయాత్రకు బయల్దేరిన CRPF మహిళా సిబ్బంది

CRPF ‘యశస్వినీ’ మహిళా బైకర్ల బృందం సాహసోపేతమైన యాత్రకు బయల్దేరింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్‌లోని పాంగాంగ్ సో సరస్సు వరకూ సాగే బైక్ ర్యాలీ మంగళవారం మొదలైంది. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, 1,400 కిలోమీటర్ల కఠిన రహదారిపై సాగే ఈ ర్యాలీలో 32 మంది మహిళా బైకర్లు పాల్గొంటున్నారు. దేశభక్తి, జాతి సమైక్యత, మహిళా సాధికారతకు ప్రతీకగా ‘దేశ్ కే హమ్ హై రక్షక్’ నినాదంతో వారు దూసుకెళ్తున్నారు.
Similar News
News February 7, 2026
1291 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 1291 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి 3 వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. BSc/BA/B.Com, టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా అర్హత గల అభ్యర్థులు నేటి నుంచి FEB 20 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18-24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. DV కోసం FEB 26న పిలుస్తారు. వెబ్‌సైట్: https://iocl.com
News February 7, 2026
మిరపలో కొమ్మ ఎండు, కాయ కుళ్లు తెగులు – నివారణ

మిరపలో ఈ తెగులు తొలుత లేత కొమ్మలు, పూతకు ఆశించడం వల్ల పూత రాలి, చివర్ల నుంచి కొమ్మలు కిందకు ఎండుతాయి. కాయలను ఆశించడం వల్ల కాయల మీద నల్లటి మచ్చలు ఏర్పడి, కుళ్లి రాలిపోతాయి. ఈ తెగులు నివారణకు ఎకరాకు 200 లీటర్ల నీటిలో డైఫెనోకోనజోల్ 25% EC 100ml లేదా క్రెసోక్సిమ్-మిథైల్ 44.3% SC 200mlలలో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయాలి. తెగులు సోకిన మొక్కల భాగాలను సేకరించి నాశనం చేయాలి.
News February 7, 2026
చదవడం, పఠించడం, స్తుతించడం, ఉచ్ఛరించడం.. తేడాలేంటి?

కళ్లతో చూస్తూ అర్థం చేసుకోవడం ‘చదవడం’. ఇది జ్ఞానాన్ని పెంచుతుంది. చదివిన దానిని నోటితో స్పష్టంగా ఉచ్ఛరించడం ‘పఠనం’. దీనివల్ల వచ్చే శబ్ద తరంగాలు వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. దైవ లీలలను కీర్తిస్తూ మనస్ఫూర్తిగా పొగడటాన్ని ‘స్తుతించడం’ అంటారు. ఇందులో భక్తే ప్రదానం. ఉన్నది ఉన్నట్లుగా కచ్చితమైన ధ్వనితో పలకడం ‘ఉచ్ఛారణ’. దీంతో మంత్రం సిద్ధిస్తుంది. మనసులోని భావం మాట రూపంలో బయటకు రావడమే ‘పలకడం’.


