News May 2, 2024
మహిళలే ఎక్కువ రోజులు బతుకుతారు కానీ..: లాన్సెట్ జర్నల్

మహిళలే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతారని లాన్సెట్ జర్నల్‌లో పరిశోధకులు వెల్లడించారు. ‘పురుషులతో పోలిస్తే మహిళలకు దీర్ఘాయువు ఉన్న మాట నిజమే. కానీ మహిళలకే ఆరోగ్య సమస్యలు ఎక్కువ. కండరాలు, ఎముకల సంబంధిత సమస్యలు సహా మానసిక వ్యాధులతో ఎక్కువగా బాధపడుతుంటారు. వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యపరంగా పురుషులు, మహిళల మధ్య భేదం పెరుగుతుంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
ఫలించిన చర్చలు… పత్తి కొనుగోళ్లు ఆరంభం

TG: పత్తి కొనుగోళ్లపై కేంద్ర మంత్రులు, CCIతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు ఫలించాయి. నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లో కొత్త నిబంధనలతో కొనుగోళ్లకు అనుమతులు లభించక మిల్లర్లు సమ్మెకు దిగారు. ప్రస్తుతం సమస్య పరిష్కారమవ్వడంతో సమ్మె విరమించారు. దీంతో రాష్ట్రంలోని 330 మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు ఆరంభమయ్యాయి. ఇప్పటి వరకు ₹2,904 కోట్ల విలువైన 3.66 లక్షల టన్నుల పత్తిని CCI సేకరించింది.
News December 1, 2025
మా రాజీనామాలను ఆమోదించండి: ఎమ్మెల్సీలు

AP: వైసీపీ, MLC పదవులకు రిజైన్ చేసిన ఆరుగురు నాయకులు ఇవాళ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశమయ్యారు. ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా స్వచ్ఛందంగానే తాము రిజైన్ చేశామని, వాటిని ఆమోదించాలని కోరారు. రాజీనామా వెనక్కు తీసుకునే ఆలోచన ఉందా? అని ఛైర్మన్ అడగగా లేదని తేల్చిచెప్పారు. మోషేన్ రాజును కలిసిన వారిలో పద్మశ్రీ, చక్రవర్తి, మర్రి రాజశేఖర్, వెంకటరమణ, జాకియా, పోతుల సునీత ఉన్నారు.
News December 1, 2025
స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.


