News May 8, 2025
Women Wellness: మంచి భార్య అనిపించుకోవాలని..!

మంచి భార్య, మంచి కోడలు అనిపించుకోవడానికి మహిళలు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీన్నే గుడ్‌వైఫ్ సిండ్రోం అంటారు. ప్రతి విషయంలోనూ సర్దుకుపోవడం, సంతోషాలను త్యాగం చేయడం గుడ్‌వైఫ్ సిండ్రోం లక్షణాలు. కుటుంబం కోసం తమ బాధలను తొక్కిపెట్టేస్తుంటారు. దీంతో వారు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కానీ ఆనందాల్ని వదులుకోకుండానే మంచిభార్యగా ఉండొచ్చు. భాగస్వామి బాధ్యతగా ఉంటే భార్యకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
Similar News
News January 31, 2026
జుట్టు ఎందుకు రాలుతుందంటే?

మనిషి శరీరంలో ఉండే ఇమ్యూనిటీ సెల్ అలోప్సియా అరెటా జుట్టు రాలడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అలోప్సియా అరెటా అనేది జుట్టుకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి జుట్టును ఎక్కువగా రాలిపోయేలా చేస్తుందని వారు తెలిపారు. ఇది ఇమ్యునిటీ తగ్గడం వల్ల కూడా జరుగుతుందని అన్నారు.
News January 31, 2026
T20 WC: ఫేక్ న్యూస్‌తో పాక్, బంగ్లా చీప్ ట్రిక్స్!

T20 వరల్డ్ కప్‌ను భారత్ హోస్ట్ చేస్తున్న వేళ పాక్, బంగ్లా కొత్త కుట్రకు తెరలేపాయి. ఇండియాలో <<19002211>>నిఫా<<>> వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందంటూ SMలో ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. ప్లేయర్స్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వరల్డ్ కప్ మ్యాచ్‌లను షిఫ్ట్ చేయాలంటూ పోస్ట్‌లు చేయిస్తున్నాయి. అయితే దేశంలో 2 కేసులు మాత్రమే నమోదయ్యాయని, దీనివల్ల ఎలాంటి రిస్క్ లేదని స్వయంగా WHOనే క్లారిటీ ఇచ్చింది.
News January 31, 2026
అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్

AP: బిట్స్ పిలానీ విద్యా సంస్థ అమరావతిలో తమ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అధికారిక ఒప్పందం చేసుకుంది. దానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం సమకూర్చింది. తుళ్లూరు మండలం వెంకటపాలెం పరిధిలో 70 ఎకరాల భూమిని బిట్స్ పిలానీకి కేటాయించింది. మొదటి దశలోనే రూ.1000 కోట్లతో ఈ పనులు ప్రారంభంకానున్నాయి. 2027నాటికి తొలిదశ పూర్తిచేసి ఆ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.


