News September 15, 2025

స్త్రీ శక్తి పథకంతో మహిళలకు రూ.118 కోట్ల లబ్ధి: మంత్రి

image

AP: నేటితో స్త్రీ శక్తి పథకం(బస్సుల్లో ఉచిత ప్రయాణం) విజయవంతంగా నెల రోజులు పూర్తి చేసుకుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు మహిళలు 3.17 కోట్ల ఉచిత టికెట్లతో ప్రయాణించారని పేర్కొన్నారు. సగటున స్త్రీ శక్తి బస్సులు 90% ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయన్నారు. మహిళా పురుషుల నిష్పత్తి 63:37గా ఉందని వెల్లడించారు. ఈ పథకంలో మహిళలకు నెల రోజుల్లో రూ.118 కోట్ల ఆర్థిక లబ్ధిని చేకూర్చిందని చెప్పారు.

Similar News

News February 2, 2026

హుజురాబాద్: మొదలైన బుజ్జగింపులు.. లేదంటే బేరసారాలు!

image

హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన రెబెల్ అభ్యర్థులను తప్పుకోవాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బుజ్జగిస్తున్నాయి. 30 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 53, బీజేపీ నుంచి 48, బీఆర్ఎస్ నుంచి 39 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అదనంగా ఉన్న అభ్యర్థులను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు బలంగా సాగుతున్నాయి. బుజ్జగింపులకు లొంగని వారితో నేతలు బేరసారాలు ప్రారంభించారు.

News February 2, 2026

జగిత్యాలలో పొలిటికల్ వార్.. నేతల వ్యాఖ్యలతో హీటెక్కిన రాజకీయం

image

మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాలలో పొలిటికల్ వార్ మొదలైంది. MLC బల్మూరి వెంకట్ శనివారం జగిత్యాలలో జీవన్ రెడ్డి, సంజయ్‌లతో విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటి పోరాదని హెచ్చరించారు. అలాగే ఎంపీ అరవింద్ జగిత్యాలలో ఎన్నికల శంఖారావంలో పాల్గొని జీవన్ రెడ్డిని వేధించడం సరికాదని, అలాగే ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని ఎద్దేవా చేయడం పొలిటికల్ హీట్‌ను ఒక్కసారిగా పెంచింది.