News August 15, 2024
కేటీఆర్ వ్యాఖ్యలపై విచారణకు మహిళా కమిషన్ ఆదేశం

TG: మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. దీనిపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయన వ్యాఖ్యలు మహిళల్ని కించపరిచేలా ఉన్నాయని కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారద Xలో అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై మాట్లాడుతూ ‘బస్సుల్లో కుట్లు, అల్లికలు కాదు. బ్రేక్ డాన్సులు వేసుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని KTR వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది.
Similar News
News October 31, 2025
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

TG: ఇంటర్ బోర్డు పరీక్షల <
News October 31, 2025
పంచ భూతాలే మానవ శరీరం

మానవ దేహం పంచభూతాలతో ఏర్పడింది. చర్మం, వెంట్రుకలు, కండరాలు భూతత్వానికి సంబంధించినవి. ఆకలి, నిద్ర, దాహం అగ్నితత్వానికి చెందినవి. నడవడం, పరుగెత్తడం వంటి కదలికలన్నీ వాయుతత్వం. మూత్రం, రక్తం, వీర్యం వంటి ద్రవాలు జలతత్వం కిందకి వస్తాయి. గరుడ పురాణం ప్రకారం.. ఆలోచన (చింత), శబ్దం, దుఃఖం (శోకం) అనేవి ఆకాశతత్వం లక్షణాలు. నూనెతో తలకు, ఒంటికి చేసే అభ్యంగనం ద్వారా ఈ సర్వేంద్రియాలకు శాంతి, శక్తి లభిస్తాయి.
News October 31, 2025
5,346 టీచర్ పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా?

ఢిల్లీలో 5,346 TGT పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు నవంబర్ 7 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.44,900 – రూ.1,42,400 అందుతుంది. వెబ్సైట్: https://dsssb.delhi.gov.in/


