News June 4, 2024
దిగ్గజ నేతలు గెలిచిన స్థానంలో మహిళ గర్జన!

AP: రాజకీయ హేమాహేమీలు గెలిచిన నంద్యాల లోక్‌సభ స్థానంలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి గెలుపు దాదాపుగా ఖాయమైంది. ఆమె 42,459 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఆమెకు 3,00,982 ఓట్లు పోలయ్యాయి. ఆమె విజయం సాధిస్తే నంద్యాలలో నెగ్గిన తొలి మహిళగా రికార్డు సృష్టించనున్నారు. కాగా ఇక్కడ గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు రెండు సార్లు, మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఓసారి గెలిచారు.
Similar News
News January 10, 2026
ఖమేనీ ఫొటోలు కాల్చి.. సిగరెట్లు తాగుతున్న ఇరాన్ యువతులు

ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ క్రమంలో యువతులు, మహిళలు ఖమేనీ ఫొటోలకు నిప్పంటించి సిగరెట్లు వెలిగించుకుంటున్నారు. ఇప్పుడు ఇది ట్రెండ్‌గా మారింది. సుప్రీంలీడర్ ఫొటో అంటించడం, మహిళలు సిగరెట్ తాగడం రెండూ నేరమే. మహిళలపై అణచివేతకు వ్యతిరేకంగా, స్వేచ్ఛను కోరుకుంటూ వాళ్లు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో యువతి లాకప్ డెత్ సమయంలోనూ ఇలాంటి నిరసనలే మహిళలు చేపట్టారు.
News January 10, 2026
బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై <<18797338>>దాడులు<<>> కొనసాగుతూనే ఉన్నాయి. 20రోజుల వ్యవధిలో మరో హిందువు హత్యకు గురయ్యాడు. సునంగంజ్ జిల్లా భంగదొహోర్‌లో ఈ దారుణం జరిగింది. తమ కుమారుడిని కొందరు విచక్షణారహితంగా కొట్టారని, ఆ తర్వాత అమిరుల్ ఇస్లామ్ అనే వ్యక్తి విషమిచ్చాడని కుటుంబం ఆరోపిస్తోంది. గురువారం ఈ దాడి జరగ్గా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ యువకుడు చనిపోయాడు. మృతుడు జై మహాపాత్రగా గుర్తించారు.
News January 10, 2026
నన్ను ఎంపిక చేయకపోవడాన్ని స్వాగతిస్తున్నా: గిల్

T20 WCకు తనను ఎంపిక చేయకపోవడంపై భారత టెస్ట్, వన్డే జట్ల కెప్టెన్ గిల్ తొలిసారి స్పందించారు. సెలక్టర్ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అలాగే WC జట్టుకు విషెస్ తెలిపారు. దేశం తరఫున ఆడుతున్న ప్రతి ప్లేయర్ తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారని, అయితే జట్టును ఎంపిక చేసే నిర్ణయం సెలక్టర్లదే అన్నారు. తాను ఎక్కడ ఉండాలనుకున్నానో అక్కడే ఉన్నానని, తన డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.


