News October 12, 2025

ఉమెన్స్ WC: భారత్ గెలుస్తుందా?

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా విజయానికి 78 బంతుల్లో 86 రన్స్ కావాలి. ప్రస్తుతం క్రీజులో హీలీ (131), గార్డ్‌నర్ (31) ఉన్నారు. భారత్ గెలవాలంటే 7 వికెట్లు పడగొట్టాలి లేదా పరుగుల్ని కట్టడి చేయాలి. ప్రస్తుతం విన్ ప్రెడిక్షన్ ప్రకారం ఆస్ట్రేలియాకు 59%, ఇండియాకి 41% విజయావకాశాలున్నాయి. మరి ఈ మ్యాచులో మన టీమ్ గెలుస్తుందా? కామెంట్ చేయండి.

Similar News

News October 13, 2025

శుభ సమయం (13-10-2025) సోమవారం

image

✒ తిథి: బహుళ సప్తమి సా.5.49 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర రా.6.25 వరకు
✒ శుభ సమయం: శివ పూజలకు మంచిది
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: తె.5.52 లగాయతు
✒ అమృత ఘడియలు: ఉ.8.58-ఉ.10.28

News October 13, 2025

TODAY HEADLINES

image

☛ ‘AP ఎక్సైజ్ సురక్షా యాప్‌’ను రిలీజ్ చేసిన సీఎం చంద్రబాబు
☛ విశాఖ అభివృద్ధికి 10 ఏళ్లు చాలు: మంత్రి లోకేశ్
☛ SRSP-2కి దామోదర్ రెడ్డి పేరు: CM రేవంత్
☛ TG బంద్ వాయిదా: BC JAC
☛ ‘స్థానిక’ ఎన్నికలు: రేపు సుప్రీంకోర్టుకు TG సర్కార్
☛ బిహార్‌లో NDA సీట్ల షేరింగ్‌ ఖరారు.. BJPకి 101 సీట్లు
☛ ఉమెన్స్ WC: భారత్ పై ఆస్ట్రేలియా విజయం
☛ అఫ్గాన్ దాడులు.. 15 మంది పాక్ సైనికులు హతం

News October 13, 2025

CRDA ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధం: నారాయణ

image

AP: అమరావతిలో CRDA ప్రధాన ఆఫీస్ ప్రారంభానికి సర్వం సిద్ధమైనట్లు మంత్రి నారాయణ తెలిపారు. రేపు 9.54AMకు CM CBN కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. తదుపరి ఆయనకు ఢిల్లీ పర్యటన ఉండటంతో బహిరంగ సమావేశం ఉండదన్నారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి రైతులందరూ ఆహ్వానితులే అని వెల్లడించారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రోడ్ E3-N11 జంక్షన్ వద్ద రాయపూడి సమీపంలో CRDA ఆఫీస్ నిర్మించిన విషయం తెలిసిందే.