News October 12, 2025
ఉమెన్స్ వరల్డ్ కప్: భారత్ ఫస్ట్ బ్యాటింగ్

ICC ఉమెన్స్ వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టులో మార్పులు చేయలేదు.
IND: ప్రతీకా, మంధాన, హర్లీన్, హర్మన్‌ప్రీత్ (C), జెమీమా, దీప్తి, రిచా, అమన్‌జోత్, రాణా, క్రాంతి, శ్రీ చరణి.
AUS: హేలీ(C), లిచ్‌ఫీల్డ్, పెర్రీ, మూనీ, సదర్లాండ్, గార్డనర్, మెక్‌గ్రాత్, మోలినక్స్, K గార్త్, అలానా, మేగాన్.
– స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.
Similar News
News October 12, 2025
రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షం

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. APలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అటు TGలో భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని పేర్కొంటూ HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 12, 2025
3వ రోజు ముగిసిన ఆట.. పోరాడుతున్న వెస్టిండీస్

INDvsWI రెండో టెస్టులో తొలి 2 రోజులు టీమ్‌ఇండియా డామినెన్స్ కనిపించింది. కాగా మూడో రోజు ఫాలో ఆన్ ఆడుతున్న వెస్టిండీస్ పోరాడుతోంది. 35కే 2 వికెట్లు పడిపోయినా బ్యాటర్లు హోప్(66), క్యాంప్‌బెల్(87) క్రీజులో పాతుకుపోయారు. మరో వికెట్ పడకుండా 138 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ జట్టు ఇంకా 97 పరుగుల వెనుకంజలో ఉంది. సిరాజ్, సుందర్ చెరో వికెట్ తీశారు.
News October 12, 2025
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకోనున్న హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. అట్లీ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న AA22 కోసం ఆయన ఏకంగా రూ.175 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభాస్ కొన్ని సినిమాలకు రూ.150 కోట్లు తీసుకున్నారని పేర్కొన్నాయి. దీంతో రాబోయే సినిమాలతో ఐకాన్ స్టార్ హాలీవుడ్ రేంజ్‌కు వెళ్తారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.