News November 25, 2024
231 ఓట్ల మెజార్టీతో గెలిచి రాజీనామాకు సిద్ధం

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో AJSU పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్టీ చీఫ్ సుదేశ్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను త్యాగం చేస్తానని ప్రకటించారు. ఇప్పటికే రాజీనామా లేఖను ఆయనకు పంపినట్లు తెలిపారు. బీజేపీ మిత్రపక్షమైన AJSU 10 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటుకు పరిమితమైంది. కేవలం 231 సీట్ల స్వల్ప మెజార్టీతోనే నిర్మల్ మహతో గట్టెక్కడం గమనార్హం.
Similar News
News November 20, 2025
NSIC లిమిటెడ్లో ఉద్యోగాలు

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(NSIC) 5పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, CA/CMA,MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు 31ఏళ్లు కాగా.. మేనేజర్కు 40 ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://nsic.co.in/
News November 20, 2025
చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల

TG: రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లు నిధులు రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల అప్పులు తీర్చేందుకు వీటిని వినియోగించనున్నారు. నిధుల విడుదలపై చేనేత కార్మికులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
News November 20, 2025
ఏపీకి మళ్లీ వర్ష సూచన

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. తర్వాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఆదివారం వరకు ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


