News May 10, 2024

WONDER: చంద్రుడిపై రైల్వే స్టేషన్

image

ఎవరి ఊహకూ అందని విధంగా చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు నాసా ప్లాన్ చేస్తోంది. చంద్రుడి ఉపరితలంపై సమర్థవంతమైన రవాణా అందించేలా పూర్తిస్థాయిలో పనిచేసే మొదటి రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ రైలు భూమిపై నడిచే దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుందని తెలిపింది. చంద్రుడిపైకి వెళ్లేందుకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతుండటంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 25, 2025

తుఫాను టైమ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

AP: <<18098989>>తుఫాను<<>> సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను APSDMA వివరించింది.
*హెచ్చరికల కోసం SMSలు గమనించండి.
*అత్యవసర సామగ్రిని సిద్ధం చేసుకోండి.
*అధికారులు సూచించగానే సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి.
*విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ కంటైనర్లలో ఉంచండి.
*విద్యుత్ మెయిన్ స్విచ్, ఎలక్ట్రానిక్స్ ఆపేయండి.
*తలుపులు, కిటికీలు మూసే ఉంచండి.
*పశువులు, పెట్స్‌ను వదిలేయండి.

News October 25, 2025

హెన్నాతో జుట్టుకు ఎన్నో లాభాలు

image

జుట్టు ఆరోగ్యాన్ని పెంచడానికి మన పూర్వీకుల నుంచి హెన్నా వాడుతున్నారు. ఇది చుండ్రును తగ్గించడంతో పాటు, జుట్టుకు సహజసిద్ధమైన రంగును అందించి కండిషనింగ్ చేస్తుంది. దీంట్లోని యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ గుణాలు కుదుళ్లలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంతో పాటు జుట్టుకు పోషణను అందించి ఒత్తుగా పెరిగేలా చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా పొడిబారిన జుట్టుకు తేమను అందించి, చివర్లు చిట్లే సమస్యనూ తగ్గిస్తుంది.

News October 25, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ నేతలతో కీలక భేటీ
* మద్యం దుకాణాల టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్
* త్వరలోనే 14,000 అంగన్‌వాడీ హెల్పర్ల నియామకం
* కర్నూల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రైవేటు బస్సుల్లో ముమ్మర తనిఖీలు
* హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో కొనసాగుతున్న వర్షాలు