News September 23, 2024
అదే జరిగితే పోటీ చేయను: ట్రంప్

ఈ ఎలక్షన్స్లో గెలవకుంటే 2028లో మళ్లీ పోటీ చేయనని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కొవిడ్ టైమ్లో తన పాలన బాగుందన్నారు. సాధారణంగా ఓటమిని అంగీకరించని ఆయన ఇలా మాట్లాడటం ఇంట్రెస్టింగ్గా మారింది. 2020లో మాదిరిగా భారీ స్థాయిలో మోసగిస్తే, తప్పుడు ఆరోపణలు చేస్తేనే అలా జరుగుతుందని ట్రంప్ చెప్పే సంగతి తెలిసిందే. 2028 నాటికి ఆయనకు 82ఏళ్లు వస్తాయి.
Similar News
News December 3, 2025
వరుసగా రెండో రోజూ పతనం.. 90 దాటిన రూపాయి

భారత రూపాయి వరుసగా రెండో రోజూ పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 90.13కు చేరింది. మంగళవారం అత్యంత కనిష్ఠంగా 89.94 వద్దకు చేరిన రూపాయి నేడు మరింత బలహీనపడింది. 2025లో ఇప్పటివరకు 5 శాతానికిపైగా పతనమైంది. USతో ట్రేడ్డీల్పై అనిశ్చితి, ఈక్విటీల్లోంచి విదేశీ నిధుల ఉపసంహరణ, బంగారం సహా దిగుమతులకు డిమాండ్, ఇన్వెస్టర్లు షార్ట్ కవరింగ్ చేస్తుండటం రూపాయిపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషకులు తెలిపారు.
News December 3, 2025
చదరంగంలో సంచలనం సృష్టించిన బుడ్డోడు

MP సాగర్ జిల్లాకు చెందిన మూడేళ్ల సర్వజ్ఞసింగ్ కుశ్వాహా ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో ఫిడే ర్యాపిడ్ రేటింగ్ (1572) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేవలం 3 సంవత్సరాల 7 నెలల 20 రోజుల వయసులో ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లను ఓడించాడు. స్మార్ట్ఫోన్ అలవాటు దూరం చేయాలనే ఉద్దేశంతో చెస్ నేర్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు. గతంలో ఈ రికార్డు WBకు చెందిన అనీశ్ సర్కార్ (3సం.8నెలలు) పేరిట ఉండేది.
News December 3, 2025
పీఎం మోదీని కలిసిన రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో ప్రధాని మోదీని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించారు. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు.


