News August 21, 2025

పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర

image

TG: పంచాయతీరాజ్ శాఖలో రేపటి నుంచి పనుల జాతర మొదలవుతుందని మంత్రి సీతక్క తెలిపారు. పనుల జాతర పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. రూ.2,198 కోట్ల విలువైన 1.01 లక్షల పనులు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టాయిలెట్లు, పొలాలకు మట్టి రోడ్లు, చెక్‌డ్యామ్‌లు, అంతర్గత సీసీ రోడ్లు, వాటర్ షెడ్లు, పశువుల కొట్టాలు, నర్సరీల పెంపకం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, తదితర పనులు చేపడతామన్నారు.

Similar News

News August 21, 2025

BREAKING: రాష్ట్రంలో విషాదం

image

AP: ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రాజంపేట(మం) బాలరాజుపల్లిలో చెయ్యేరు నదిలో 8 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా, ముగ్గురు ఇసుక ఊబిలో చిక్కుకుని చనిపోయారు. మృతులు స్థానిక కాలేజీలో MBA చదువుతున్న దిలీప్, చంద్రశేఖర్, కేశవగా గుర్తించారు. నిన్న కర్నూలు (D) ఆస్పరి (M) చిగిలిలో నీటి కుంటలో ఈతకు వెళ్లిన <<17465047>>ఆరుగురు <<>>చిన్నారులు మృతిచెందారు.

News August 21, 2025

రైతు బతుకును బజారున పడేశావు: KTR

image

TG: బస్తా యూరియా కోసం రైతు బతుకును బజారున పడేశావంటూ CM రేవంత్‌పై KTR ఫైర్ అయ్యారు. యూరియా కోసం చెప్పుల వరసలో రైతు పడుకున్న ఫొటో షేర్ చేశారు. ‘ఈ ఫొటోను ఫ్రేమ్ కట్టించుకుంటావో, మెడలో వేసుకుని ఊరేగుతావో నీ ఇష్టం. అన్నదాతను అప్పులపాలు చేసిన చేతకాని పాలకులను చూశాం. కానీ చెప్పులపాలు చేసిన రికార్డు నీదే. కడుపు నింపే రైతును పాదరక్షల పాల్జేసిన నీ పాపం ఊరికే పోదు. జై కిసాన్ జై తెలంగాణ’ అని పోస్ట్ చేశారు.

News August 21, 2025

పాక్‌తో మ్యాచ్.. BCCIపై ఫ్యాన్స్ ఫైర్

image

ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచులు ఖరారైనట్లే. <<17474721>>క్రీడాశాఖ<<>> కూడా పరోక్షంగా ఒప్పుకుంది. దీంతో BCCIపై SMలో విమర్శలొస్తున్నాయి. ‘BCCIకి జవాన్ల త్యాగాలు, మన మనోభావాలతో పనిలేదు. డబ్బులొస్తే చాలు. అమరవీరుల సమాధులపై మీరు క్రికెట్ ఆడతామంటున్నారు. నీళ్లు-రక్తం కలిసి ప్రవహించలేవు. కానీ BCCI కోసం రక్తం-డబ్బు కలిసి ప్రవహిస్తాయి. మీరు డబ్బుకోసం పాక్‌తో ఆడినా.. మేము ఆ మ్యాచులు చూడం’ అంటూ పోస్టులు పెడుతున్నారు.