News October 7, 2024
Work From Home పని వేళలపై చట్టాల్లో అస్పష్టత: CM పినరయి

ప్రస్తుతం అమల్లో ఉన్న కార్మిక చట్టాలు వర్క్‌ఫ్రం హోం విధానాల్లో ‘పని వేళల్ని’ స్పష్టంగా నిర్దేశించలేకపోతున్నాయని CM పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. కేరళకు చెందిన EY సంస్థ ఉద్యోగిని మృతిపై ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు. IT పార్కుల్లో లీజుకు ఉండే కంపెనీలు కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తే ఉద్యోగులు న్యాయపరంగా ఎదుర్కోవచ్చన్నారు. ఉద్యోగుల ఆందోళనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.
Similar News
News January 8, 2026
ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య

ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ముగ్గురిలో ఒకరు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఎక్కువగా షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి అలవాట్లు దీనికి ప్రధాన కారణాలు. ఎప్పుడూ నీరసంగా, అలసటగా ఉండటం, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఉంటే టెస్ట్ చేపించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే దీనికి చెక్ పెట్టొచ్చని అంటున్నారు.
News January 8, 2026
ఆ వార్త చదివి గుండె బద్దలైంది: శిఖర్ ధావన్

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై సామూహిక దాడి ఘటనపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆ వార్త చదివి గుండె బద్దలైంది. ఎవరిపైన అయినా, ఎక్కడైనా హింస ఆమోదయోగ్యం కాదు. బాధితురాలికి న్యాయం జరగాలి” అని ట్వీట్ చేశారు. కాగా ఇద్దరు వ్యక్తులు ఓ 40 ఏళ్ల హిందూ వితంతువును రేప్ చేసి, ఆమె జుట్టు కత్తిరించి, చెట్టుకు కట్టేసి టార్చర్ చేశారు. ఈ వీడియో SMలో <<18770990>>వైరల్<<>> అవుతోంది.
News January 8, 2026
రైళ్ల శుభ్రతపై భారీగా ఫిర్యాదులు

ట్రైన్లలో కోచ్‌ల శుభ్రత, బెడ్ రోల్స్‌కు సంబంధించి Rail Madad యాప్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్ (13,406), నవంబర్ (13,196)లో సుమారు 50% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ‘సంతృప్తికర’ ఫీడ్‌బ్యాక్‌లు కూడా తగ్గాయి. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించింది.


