News November 1, 2024

శ్రమించి.. విజయాన్ని ముద్దాడి!

image

విజయాన్ని ముద్దాడటం అంత ఈజీ కాదు. దానికోసం ఎంతో శ్రమించాలి. అలా శ్రమించి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ యంగ్ ప్లేయర్లు. IPL-2025 రిటెన్షన్‌లో వీరిని రూ.కోట్లు వరించాయి. రింకూ సింగ్‌ను గతేడాది రూ.55 లక్షలకు కొంటే ఇప్పుడు రూ.13 కోట్లు, గతేడాది రూ.20లక్షలు పొందిన ధ్రువ్ జురెల్ ఇప్పుడు రూ. 14 కోట్ల జీతం పొందారు. రజత్ & మయాంక్ ఇద్దరూ గతేడాది రూ.20 లక్షలు పొందితే 2025 IPLలో రూ.11 కోట్లు రానున్నాయి.

Similar News

News February 17, 2026

ALERT: మీ ఐఫోన్‌ను అప్డేట్ చేసుకోండి!

image

ఐఫోన్‌లోని 39 భద్రతా లోపాలను సరిచేస్తూ యాపిల్ iOS 26.3 అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ లోపాల వల్ల హ్యాకర్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే లేదా ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల సైబర్ దాడులు జరిగినట్లు సమాచారం. అందుకే ఐఫోన్‌ను అప్డేట్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. Settings > General > Software Update లోకి వెళ్లి లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు.

News February 17, 2026

సభకు రాని MLAలను రికాల్ చేయాలి: స్పీకర్

image

AP: సభకు హాజరుకాని MLAలను రికాల్ చేయాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. ‘8 దేశాల్లో ఈ విధానం ఉంది. కొందరు MLAలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారు. విధులకు రాకపోతే ఉద్యోగుల జీతాల్లో కోత వేస్తున్నాం. అలాగే వీరి శాలరీ ఎందుకు కట్ చేయకూడదు’ అని ప్రశ్నించారు. సభలో MLAల కన్నా మాక్ అసెంబ్లీలో విద్యార్థులే బాగా మాట్లాడారని తెలిపారు. ఇక డిజిటల్ అటెండెన్స్ పనితీరు బాగుందన్నారు.

News February 17, 2026

మ.1.30 గం. వరకే స్కూళ్లు

image

TG: రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఉ.8 గం. నుంచి మ.1.30 గం. వరకు మాత్రమే స్కూళ్లు నడుస్తాయని పేర్కొంది. ఈ కొత్త వేళలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. అటు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ముస్లిం ఉద్యోగులు ఈ మాసంలో 4PM కల్లా విధులు ముగించి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.