News February 23, 2025
పనికి జస్టిఫై చేయాలి.. లేదంటే ఉద్యోగాల కోత: మస్క్

US అధ్యక్షుడు ట్రంప్కు సలహాదారుగా ఉన్న ఎలాన్ మస్క్ ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేశారు. ‘ఫెడరల్ సిబ్బంది తమ పనికి జస్టిఫై చేయాలి. లేదంటే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. వారం రోజుల్లో ఏం చేశారో ప్రతి సోమవారం రా.11.59లోపు నివేదిక సమర్పించాలని కోరారు. ఈ ప్రకటనను ఫెడరేషన్ అధ్యక్షుడు ఎవెరెట్ కెల్లీ ఖండించారు. చట్టవిరుద్ధమైన తొలగింపులను కోర్టులో సవాల్ చేస్తాన్నారు.
Similar News
News February 23, 2025
మిర్చి రైతులను ఉద్ధరించినట్లు కూటమి గప్పాలు: షర్మిల

AP: మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఏదో ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రూ.26వేల కనీస ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళ్లలో కారం కొడుతుందని దుయ్యబట్టారు. టమాటా రైతులనూ ఆదుకోవాలన్నారు. ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News February 23, 2025
రేపు ఉ.10 గంటలకు..

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.
News February 23, 2025
అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు: పీఎం మోదీ

వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామని PM మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లో బాగేశ్వర్ ధామ్ మెడికల్&సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. క్యాన్సర్కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకుకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. క్యాన్సర్తో పోరాడేందుకు బడ్జెట్లో కొన్ని ప్రకటనలు చేశామని, మందులు చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.