News March 15, 2025
22 రోజులైనా దొరకని కార్మికుల జాడ

TG: SLBC టన్నెల్లో కార్మికులు చిక్కుకుపోయి 22 రోజులైనా వారి జాడ తెలియడం లేదు. రోబోకు అనుసంధానంగా లిక్విడ్ రింగ్ వాక్యూమ్ ట్యాంక్ యంత్రంతో రెస్క్యూ చేపడుతున్నారు. D-2 ప్లేస్లో 4 మానవ అవశేషాలు ఉన్నట్లు GPR స్కానర్ చూపినా అక్కడ ఎలాంటి ఆచూకీ దొరకలేదు. దీంతో అక్కడ తవ్వకాలు నిలిపేసి హై రిస్క్ ఉన్న D-1 దగ్గర తవ్వకాలు జరపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు ఒక మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే.
Similar News
News March 16, 2025
అమెరికాలో తుపాను ధాటికి 16మంది మృతి

అమెరికాలో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. దీని వల్ల ఇప్పటివరకూ 16మంది మృతి చెందారు. మిస్సోరీ రాష్ట్రంలో 10మంది, అర్కన్నాస్లో ముగ్గురు మరణించగా వివిధ ప్రాంతాలలో పదుల సంఖ్యలో ప్రజలు గాయాలపాలయ్యారు. బలమైన గాలుల ధాటికి భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలలో కార్చిచ్చులు చెలరేగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దీంతో రాష్ట్రాలకు వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీచేసింది.
News March 16, 2025
శ్రీశైలంలో ఆన్లైన్ గదుల పేరుతో భక్తులకు టోకరా..!

AP: శ్రీశైలం క్షేత్రంలో ఆన్లైన్ మోసగాళ్లు వసతి గదుల పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి భక్తులను మోసం చేస్తున్నారు. ఒక భక్తుడు మల్లికార్జున సదన్ పేరుతో ఉన్నవెబ్సైట్లో గదులు బుక్ చేసుకున్నారు. దీనికిగాను రూ.7000 చెల్లించాడు. తీరా గదుల కోసం విచారించగా నకిలీదని తేలింది. హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి ఈ విధంగానే మోసపోయాడు. అధికారులు స్పందించి మోసాలను అరికట్టాలని భక్తులు కోరుతున్నారు.
News March 16, 2025
IPL: ఆ జట్టుకు బ్యాడ్ న్యూస్

మరో వారంలో ఐపీఎల్ ప్రారంభం కానుండగా రాజస్థాన్ రాయల్స్కు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్కు బెంగళూరులోని ఎన్సీఏ ఇంకా క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో 23న SRHతో మ్యాచుకు ఆయన దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఆడినా బ్యాటింగ్ మాత్రమే చేస్తారు. వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లేదంటే ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగొచ్చని వార్తలు వస్తున్నాయి.