News July 15, 2024
తాగునీటి ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ రుణాలు

AP: జల్ జీవన్ మిషన్లో భాగంగా పెండింగ్లో ఉన్న తాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు రుణం ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాంక్ ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమై చర్చించారు. అలాగే రాష్ట్ర బడ్జెట్లోనూ నిధులు కేటాయించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News December 7, 2025
వైజాగ్ పోర్టు రికార్డు.. 249 రోజుల్లో 60MMT

AP: విశాఖ పోర్టు సరుకు రవాణాలో రికార్డు సృష్టించింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్(2025-26)లో 249 రోజుల్లోనే 60M మెట్రిక్ టన్నుల సరుకును హ్యాండిల్ చేసింది. ఈ ఘనత సాధించడానికి గతేడాది 273రోజులు, 2023-24లో 275డేస్ పట్టింది. వాణిజ్యంలో జరుగుతున్న మార్పులు, మౌలిక వసతుల సవాళ్లను అధిగమించి, ప్రత్యామ్నాయ ట్రాన్స్పోర్ట్ మార్గాలపై దృష్టి సారించడంతోనే ఇది సాధ్యమైనట్లు పోర్టు ఛైర్మన్ అంగముత్తు పేర్కొన్నారు.
News December 7, 2025
మగవారి కంటే ఆడవారికే చలి ఎందుకు ఎక్కువంటే?

సాధారణంగా పురుషులతో పోలిస్తే ఆడవారిలో చలిని తట్టుకొనే శక్తి తక్కువ. మహిళల్లో పురుషులతో పోలిస్తే కండర ద్రవ్యరాశి తక్కువగా ఉంటుంది. దీనివల్ల మహిళల్లో వేడి తక్కువగా విడుదల అవుతుందంటున్నారు నిపుణులు. అలాగే ప్రోజెస్టెరాన్ హార్మోన్, థైరాయిడ్, మెటబాలిజం తక్కువగా ఉండటం, స్త్రీలలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ప్రభావితమవుతుందంటున్నారు.
News December 7, 2025
DRDOలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారా?

<


