News August 12, 2024

సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల భేటీ

image

AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ఈ బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటించింది. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, VIT, SRM యూనివర్సిటీలు, AIIMS, కొండవీటి వాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఈ టీం పరిశీలించింది. అమరావతిపై ఎలా ముందుకెళ్లాలనే అంశాలను వారికి వివరించిన బాబు.. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని వారిని కోరారు.

Similar News

News February 5, 2026

చల్కా భూములను సాగుకు అనువుగా ఎలా మార్చాలి?

image

చల్కా నేలల్లో లవణం, ఇసుక సమాన మోతాదులో ఉంటాయి. సేంద్రియ కర్బనం తక్కువగా.. ఐరన్, అల్యూమినియం ఆక్సైడ్‌లు ఎక్కువగా ఉండటం వల్ల సాగులో సమస్యలు వస్తాయి. ఈ భూముల్లో మొలక రాకపోవటం, వచ్చినా దెబ్బతినడం, మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఈ భూముల్లో ఏటా ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును పంట విత్తే ముందు వేసుకోవాలి. మల్చింగ్‌ వేయాలి. విత్తిన సాళ్ల వెంబడి పశువుల ఎరువును వేస్తే మొలక శాతం పెరుగుతుంది.

News February 5, 2026

అప్పటి TTD ఛైర్మన్‌కు తెలిసే జరిగింది: CBN

image

AP: దేవుడితో పెట్టుకోవడం మంచిది కాదని YCP నేతలకు సీఎం చంద్రబాబు హితవు పలికారు. ‘వేంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీయాలని కావాలని చేసిన కార్యక్రమం ఇది. అప్పటి TTD బోర్డు ఛైర్మన్ PA ఖాతాలో రూ.4కోట్లకు పైగా నగదు జమైంది. అంతా అప్పటి బోర్డు ఛైర్మన్‌కు తెలిసే జరిగింది. దోషులను శిక్షిస్తాం.. ఎవరినీ వదిలిపెట్టం. దేవుడి పవిత్రత, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు.

News February 5, 2026

33 గంటల ట్రాఫిక్ నరకం.. హెలికాప్టర్‌లో వెళ్లిపోయాడు!

image

గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఏకంగా 33 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఇందులో పారిశ్రామికవేత్త సుధీర్ మెహతా దాదాపు 8 గంటలు కారులోనే వేచి ఉండి విసిగిపోయారు. ఈక్రమంలో హెలికాప్టర్‌ను పిలిపించుకొని పుణేకు వెళ్లినట్లు ఆయన ట్వీట్ చేయగా వైరలవుతోంది. ఎమర్జెన్సీ సమయాల్లో వీలుండేలా ఎక్స్‌ప్రెస్ వేల వద్ద హెలిప్యాడ్స్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.