News July 4, 2024

వరల్డ్ కప్ వచ్చేసిందోచ్..

image

భారత్ క్రికెట్ అభిమానుల 17ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ కొద్ది క్షణాల క్రితం భారత గడ్డపై వాలింది. రోహిత్ సేనకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. టోర్నీ శనివారమే ముగిసినా ఫైనల్ జరిగిన బార్బడోస్‌లో తుపాను వల్ల భారత జట్టు రావడం ఆలస్యమైంది. కాగా ఈ రోజు సా.5 గంటలకు ముంబైలో ప్లేయర్లు రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రి వాంఖడేలో BCCI భారత జట్టును సన్మానించనుంది.

Similar News

News March 5, 2026

ఏపీ పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

image

ఏపీలో పదో తరగతి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. <>https://bse.ap.gov.in/<<>> సైట్ లేదా మన మిత్ర వాట్సాప్ నంబర్ 9552300009, లీప్ యాప్‌‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వెబ్‌సైట్ సర్వర్ బిజీగా ఉండటంతో వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

News March 5, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో 5 పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 10 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి BTech/BE (సివిల్ ఇంజినీరింగ్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు నెలకు రూ.65వేలు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్‌కు రూ.55వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.cochinport.gov.in

News March 5, 2026

ఉగాదికి ‘ఉస్తాద్ భగత్‌ సింగ్’

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్లు ఈనెల 26న కాకుండా ఉగాది సందర్భంగా ఈనెల 19న రిలీజ్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ‘ఈ ఉగాదికి ఉస్తాద్ ఊచకోత’ అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.