News October 25, 2025
వరల్డ్ కప్.. RO-KO ఆడతారహో!

క్రికెట్ ప్రపంచం మొత్తం ‘RO-KO’ అంటూ నినదిస్తోంది. AUSపై మూడో వన్డేలో రోహిత్(121*)-కోహ్లీ(74*) అదరగొట్టేశారు. ఈ ప్రదర్శనతో ఫ్యాన్స్‌లో WC-2027పై ఆశలు చిగురించాయి. మ్యాచ్ తర్వాత ఇంటర్వ్యూలో వరల్డ్ కప్ గురించి అడగ్గా.. ఎగ్జైటెడ్‌గా ఉన్నామని రోహిత్, కోహ్లీ సమాధానం చెప్పారు. దీంతో ‘వీళ్లకు ఏజ్ జస్ట్ ఏ నంబర్, వరల్డ్ కప్‌కు రో-కో వస్తున్నారు, ఈ జోడీ ఉంటే కప్పు మనదే’ అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.
Similar News
News October 25, 2025
అర్ధరాత్రి లోపు అప్డేట్ చేయకపోతే జీతాలు రావు: ఆర్థిక శాఖ

TG: అక్టోబర్ నెల వేతనాలను ఆధార్‌తో లింక్ అయి ఉన్న <<18038300>>ఉద్యోగులకే<<>> ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అన్ని శాఖల ఉన్నతాధికారులకు సర్క్యులర్ పంపారు. ఇవాళ అర్ధరాత్రి IFMIS పోర్టల్‌లో ఆధార్ లింక్ చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఆధార్‌తో లింక్ కాని ఉద్యోగులకు జీతాలు జమ కావని స్పష్టంచేశారు.
News October 25, 2025
మరో రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP: తుఫాన్ నేపథ్యంలో అధికారులు మరో రెండు జిల్లాలకు సెలవు ఇచ్చారు. ఇప్పటికే తూ.గో, అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లోని విద్యాసంస్థలకు <<18103274>>హాలిడేస్<<>> ప్రకటించగా తాజాగా బాపట్ల, కడప జిల్లాల్లోనూ సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలో ఈనెల 27,28,29న, కడపలో 27,28న ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.
News October 25, 2025
US ఆఫీసర్ హత్య.. మోదీని టార్గెట్ చేసినందుకేనా?

US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్‌లో హత్యకు గురవడం అనుమానాలకు దారితీసింది. PM మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్‌ను హతమార్చిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్ కార్లో రహస్యంగా చర్చించారని పేర్కొన్నాయి. దేశ ప్రజలకు నిజమేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత సింఘ్వీ తాజాగా డిమాండ్ చేశారు.


