News October 23, 2024
ప్రపంచ రికార్డు: 20 ఓవర్లలో 344 రన్స్ బాదేశారు!

పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 20 ఓవర్లలో 344 పరుగులు చేసింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట ఉన్న 314 రన్స్‌ను బద్దలుగొట్టింది. ఆ జట్టు బ్యాటర్లలో సికందర్ రజా 33 బంతుల్లోనే సెంచరీ(15 సిక్సులు) చేశారు. టీ20 వరల్డ్ కప్‌నకు క్వాలిఫయర్ మ్యాచులు ఆఫ్రికా దేశాల మధ్య జరుగుతున్నాయి.
Similar News
News March 16, 2025
KKRకు బిగ్ షాక్

ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఈ సీజన్‌కు దూరమయ్యారు. ఆయన స్థానంలో చేతన్ సకారియాను భర్తీ చేయనున్నారు. చేతన్‌కు KKR రూ.75 లక్షలు చెల్లించనుంది. ఇప్పటివరకు 19 మ్యాచులు ఆడిన సకరియా 20 వికెట్లు తీశారు.
News March 16, 2025
పార్టీ కమిటీలను వెంటనే నియమించాలి: సజ్జల

AP: ప్రతి నియోజకవర్గంలో పార్టీ కమిటీల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని YCP రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి నేతలను ఆదేశించారు. వీటి విషయంలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదన్నారు. ఇందుకోసం పార్టీ సెంట్రల్ ఆఫీసులో జనరల్ సెక్రటరీలు, రీజనల్ కో ఆర్డినేటర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు. కమిటీ ఏర్పాట్లపై పార్టీ అధినేత జగన్ దృష్టి పెట్టారని, జిల్లా అధ్యక్షులు వెంటనే వీటిపై స్పందించాలని సూచించారు.
News March 16, 2025
పింఛన్‌దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

AP: రాష్ట్రంలో కొందరు వృద్ధులకు వేలిముద్రలు అరిగిపోయి పెన్షన్ల పంపిణీ సమయంలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు 1,34,450 అత్యాధునిక స్కానర్లను పంపిణీ చేయనుంది. ఇందులో ఉడాయ్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేశారు. ఈ పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టొచ్చని సర్కార్ భావిస్తోంది.