News October 15, 2024

ఇస్రో చీఫ్‌కు వరల్డ్ స్పేస్ అవార్డు

image

ఇస్రో చీఫ్ సోమనాథ్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024ను అందుకున్నారు. మిలాన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో దానికి గుర్తుగా ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది.

Similar News

News January 21, 2026

రాష్ట్రంలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌లు

image

తెలంగాణలో మరో 6 అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ‘నగర్ వన్ యోజన’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడతగా రూ.8.26 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్ గూడ-II, మంచిర్యాల జిల్లా ఇందారం, చెన్నూర్, మేడ్చల్ జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పార్కుల ఏర్పాటు జరుగుతుంది.

News January 21, 2026

జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’

image

AP: పర్యాటక శాఖ JAN 24-FEB 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనుంది. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలో 9 రోజులపాటు ఉత్సవం జరగనుంది. విశాఖలో JAN 24-31 వరకు, JAN 29, 30 అనకాపల్లిలో, JAN 30-FEB 1 వరకు అరకు లోయలో ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనిలో 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 3000 మందికి ప్రత్యక్ష, 1800 మంది సహాయకులకు ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు.

News January 21, 2026

జనవరి 21: చరిత్రలో ఈరోజు

image

1924: సోవియట్ యూనియన్ వ్యవస్థాపకుడు వ్లాదిమిర్ లెనిన్ మరణం
1950: ప్రముఖ బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ మరణం
1952: సినీనటుడు ప్రదీప్ రావత్ జననం
1986: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(ఫొటోలో) జననం
2011: తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ మరణం
1972: త్రిపుర, మణిపుర్, మేఘాలయ రాష్ట్రాల ఆవిర్భావం