News December 24, 2024
విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు: బుద్ధప్రసాద్

AP: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరుగుతాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. విజయవాడలోని KBN కాలేజీలో ఈ సభలు జరుగుతాయని చెప్పారు. పర్యావరణంపై 170 మందితో ప్రత్యేక సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రసంగాలు, కవి సమ్మేళనాలు, సదస్సులు ఉంటాయని చెప్పారు.
Similar News
News October 22, 2025
BELలో 47 పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) బెంగళూరు 67 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, బీటెక్, BSc(ఇంజినీరింగ్), ME, ఎంటెక్, MCA ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.150. SC, ST, PWBDలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్సైట్: https://bel-india.in/
News October 22, 2025
కార్తీక మాసంలో విష్ణుమూర్తికీ ప్రాధాన్యమెందుకు?

కార్తీక మాసానికి హరిహరుల మాసమని పేరుంది. ఈ నెలలో చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు. ఆ రోజున నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసి కాశీ విశ్వనాథుడిని అర్చిస్తాడని పురాణాల్లో ఉంది. అలాగే విష్ణువు రామావతారం దాల్చినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి సహకరించాడని ప్రతీతి. హరిహరులిద్దరూ కలిసి జలంధరుడిని అంతం చేశారు. అందుకే ఈ మాసంలో భేదాలు లేకుండా శివుడిని, విష్ణుమూర్తినీ పూజించాలి.
News October 22, 2025
ఇంటర్ పరీక్షల్లో మార్పులు!

AP: ఇంటర్ పరీక్షల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఇకపై గణితం ఒకే పేపర్ 100 మార్కులకు ఉంటుంది. 35 మార్కులొస్తే పాస్ అవుతారు. బయాలజీ (BiPC), ఫిజిక్స్, కెమిస్ట్రీలో 85 మార్కులకు పరీక్షలుంటాయి. ఫస్టియర్లో 29, సెకండియర్లో 30 మార్కులు వస్తే పాసవుతారు. ప్రస్తుతం సెకండియర్ చదివేవారికి ఇవి వర్తించవు. కాగా 1st అటెంప్ట్లో 4 పేపర్లలో 35% మార్కులొచ్చి, ఓ పేపర్లో 30% వచ్చినా పాసేనని అధికారులు చెప్తున్నారు.