News September 27, 2024
World Tourism Day: ఉత్తరాంధ్ర వరం రామతీర్థం

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థం ఉత్తరాంధ్రకే పెద్ద వరంగా చెప్పొచ్చు. సహజసిద్ధంగా ఉండే బోడికొండ ప్రకృతి ప్రేమికులను తన చెంతకు రప్పించుకుంటుంది. రాముడు నడయాడిన నేలగా కొండపై ఎన్నో చారిత్రక ఆనవాళ్లున్నాయి. దుర్గాభైరవకొండ, గురు భక్తుల కొండ మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంతటి ఘనకీర్తి ఉన్నప్పటికీ కనీసం రహదారి సదుపాయం కూడా లేదు. ప్రభుత్వం దృష్టిపెడితే గొప్ప పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
Similar News
News November 16, 2025
1100 కాల్ సెంటర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

అర్జీదారులు ‘మీ కోసం కాల్ సెంటర్ 1100’ సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించారు.
News November 16, 2025
చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా చూసుకోవాలి: డా.వెంకటాచలం

చలికాలంలో స్కిన్ అలర్జీలు రాకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహారాజా సర్వజన ఆసుపత్రి డెర్మటాలజీ హెచ్ఓడీ డా.వెంకటాచలం ఆదివారం తెలిపారు. శరీరం పొడిబారకుండా చూసుకోవాలన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయట తిరగకూడదన్నారు. స్నానం చేసిన వెంటనే గ్లిజరిన్ ఆయిల్ లేదా కొబ్బరినూనె రాసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.
News November 16, 2025
ఈ ఏడాది 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం: మంత్రి

జిల్లాలో ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి రైతు తన పంటను అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గజపతినగరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. గత ఏడాది 3.34లక్షల వేలు మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 4 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించేలా లక్ష్యాన్ని నిర్ణయించినట్లు తెలిపారు.


