News September 27, 2024

World Tourism Day: మీకు నచ్చిన స్పాట్ ఏది?

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఎటు చూసినా పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్లు, ఉరికే జలపాతాలు, విశాలంగా సముద్ర తీరం, పెంచలకోన, రంగనాథస్వామి దేవాలయం, ఉదయగిరి కోట, సోమశిల డ్యాం ప్రాజెక్ట్, దేశానికే తలమానికంగా నిలిచే శ్రీహరి కోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ చూపరులను కట్టి పడేస్తుంది. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.

Similar News

News December 4, 2025

కండలేరుకు పెరుగుతున్న వరద నీరు

image

కండలేరు జలాశయం నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 6,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 11 గంటలకు 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కండలేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో ప్రస్తుతం కండలేరులో నీటిమట్టం 60 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

News December 4, 2025

బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

image

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

News December 4, 2025

కండలేరు జలాశయాన్ని పరిశీలించిన కలెక్టర్

image

దిత్వా తుఫాను నేపథ్యంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కండలేరు జలాశయాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం పరిశీలించారు. ప్రస్తుతం 60 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ఎటువంటి ప్రమాదం లేదని ఎస్.ఈ.సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. ఎగువ నుంచి వచ్చే వరద నీటిని నిరంతరం పర్యవేక్షించి, అవసరమైనప్పుడు నీటిని విడుదల చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమీప గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.