News September 27, 2024

World Tourism Day: మీకు నచ్చిన స్పాట్ ఏది?

image

ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యాటక స్వర్గధామంగా విరాజిల్లుతోంది. ఎటు చూసినా పచ్చని కొండలు, గలగల పారే సెలయేళ్లు, ఉరికే జలపాతాలు, కొండలను చుట్టిన పాములా మెలికలు తిరిగిన ఘాట్‌ చూపరులను కట్టి పడేస్తాయి. అటు తిరుమల కొండలు, చంద్రగిరి కోట, కళ్యాణి డ్యాం, కైగల్ జలపాతం, కాణిపాకం టెంపుల్, హార్సిలీ హిల్స్ అందాలు చూపరులను కట్టి పడేస్తున్నాయి. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.

Similar News

News October 4, 2024

డ్యూటీలో ఉన్నప్పుడు పరిసర కార్యకలాపాలపై నిఘా ఉంచండి

image

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు విశేష సేవలు అందించాలని, విధులను నిర్వర్తించడంతో పాటు, డిప్యూటేషన్ సిబ్బంది తమ పరిసరాలపై నిఘా ఉంచి, అప్రమత్తంగా ఉండాలని, సమస్యను పరిష్కరించడంలో ముఖ్యపాత్ర పోషించాలని టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నారు. తిరుమల ఆస్థాన మండపంలో గురువారం సాయంత్రం బ్రహ్మోత్సవాల విధులకు హాజరైన ఉద్యోగులను ఉద్దేశించి ఈఓ, అదనపు ఈఓలు మాట్లాడారు. అందరూ సమన్వయంతో పని చేయాలని కోరారు.

News October 3, 2024

తిరుపతి: సీఎం పర్యటన సందర్భంగా కాన్వాయ్ రిహార్సల్స్

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో రేణిగుంట నుంచి తిరుమల వరకు కాన్వాయ్ ట్రైల్ రన్ ను ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. భద్రత ఏర్పాట్లను ఎస్పీ ఇంటిలిజెన్స్ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. విమానాశ్రయంలో వాహన శ్రేణి పోలీస్ అధికారులు, డ్రైవర్లు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు.

News October 3, 2024

రేపే తిరుపతిలో ఉద్యోగ మేళా

image

తిరుపతిలోని పద్మావతిపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. 4 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ, ఎంకాం పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.