News September 27, 2024
World Tourism Day: శ్రీకాకుళం జిల్లాలో మీకు నచ్చిన స్పాట్ ఏది?
శ్రీకాకుళం జిల్లాలో పురాతన ఆలయాలు, బీచ్ లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అరసవిల్లి, తేలినీలాపురం పక్షి సంరక్షణా కేంద్రం, దంతపురి, శ్రీముఖలింగంతో పాటు పలు ప్రాంతాలు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. వీటితో పాటు కళింగపట్నం , భావనపాడు,బారువ బీచ్‌లు ఉల్లాసంగా గడిపేందుకు తోడ్పాటునిస్తున్నాయి. మరి మీకు ఇష్టమైన స్పాట్ ఏంటో కామెంట్ చెయ్యండి.
Similar News
News October 5, 2024
SKLM: ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ప్రతీ శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని ప్రజలకు తెలిపారు.
News October 5, 2024
ఆమదాలవలస: ‘ఖరీఫ్‌కు ఈ–పంట, ఈ కేవైసీ తప్పనిసరి’
ఖరీప్‌కు ఈ-పంట నమోదు, ఈకేవైసీ కార్యక్రమాన్ని రైతులు విధిగా చేయించుకోవాలని, ఆరోగ్యవంతమైన, నాణ్యమైన పంటలను పండించే దిశగా వారిని వ్యవసాయ అధికారులు కూడా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆమదాలవలస మండలంలోని తొటాడ గ్రామంలో శనివారం ఖరీఫ్ వరికి ఈ పంట నమోదు కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన సర్వే నంబర్లలోని వరి పంట పొలాలను సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
News October 5, 2024
శ్రీకాకుళం: హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూత
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక చేయూతగా నగదు చెక్కును జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చేతుల మీదుగా శనివారం ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన హోంగార్డు జి సురేష్ సతీమణి దుర్గ భవానికి తోటి ఉద్యోగుల ఆర్థిక సహాయంగా స్వతహాగా ఇచ్చిన 4.29 లక్షల నగదు చెక్కును అందజేసి మానవత్వం చాటారు. పోలీసు కుటుంబాలకు అండగా ఉంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.