News November 4, 2024

రేపటి నుంచి వరల్డ్ ట్రావెల్ మార్కెట్.. నేడు లండన్‌కు మంత్రి జూపల్లి

image

TG: ఈనెల 5 నుంచి 7 వరకు జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో పాల్గొనేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ లండన్‌కు వెళ్లనున్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన UK పర్యటన సాగనుంది. ప్రపంచ పర్యాటకులకు తెలంగాణ చరిత్ర, వారసత్వ సంపద తెలిసేలా పర్యాటక శాఖ అక్కడ ఓ స్టాల్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ట్రావెల్ మార్ట్‌లో 100కు పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటారు.

Similar News

News November 25, 2025

ఖమ్మం జిల్లాకు3,107 టన్నుల యూరియా

image

ఖమ్మం జిల్లాకు యూరియా, కాంప్లెక్స్ ఎరువుల పంపిణీని చింతకాని మండలం పందిళ్లపల్లి ర్యాక్ పాయింట్‌లో టెక్నికల్ ఏవో పవన్ కుమార్ పరిశీలించారు. ర్యాక్ పాయింట్‌కు మొత్తం 3107.16 మెట్రిక్ టన్నుల యూరియా చేరింది. ఇందులో ఖమ్మం (1517 MT), భద్రాద్రి (500 MT) కేటాయించారు. రైతులకు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

News November 25, 2025

బద్దలైన అగ్నిపర్వతం.. భారత్‌లో యాష్ క్లౌడ్

image

ఇథియోపియాలో బద్దలైన హేలీ గబ్బీ <<18379051>>అగ్నిపర్వతం<<>> ప్రభావం INDపై చూపుతోంది. దీని పొగ అర్ధరాత్రి ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130km వేగంతో ఎర్రసముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్‌లో కనిపించింది. 25,000-45,000 అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. హరియాణా, గుజరాత్‌, పంజాబ్, UP, HPకీ వ్యాపించే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడుతోంది.

News November 25, 2025

కుడి ఎడమైతే.. మెదడుకు మంచిదే

image

ప్రతిరోజూ కుడి చేతితో చేసే పనులను ఎడమ చేత్తో చేస్తే మెదడు చురుగ్గా మారుతుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ స్టడీలో వెల్లడైంది. కుడి చేతితో చేసే పనికి ఎడమ చేతిని ఉపయోగిస్తే మెదడు చురుకుదనం, ఏకాగ్రత, మెమొరీ పెరుగుతాయి. రెగ్యులర్‌గా కుడి చేతితో చేసే బ్రషింగ్‌కు ఎడమ చేతిని ఉపయోగించండి. ఇలా చేస్తే చిన్న చిన్న సవాళ్లను ఇష్టపడే మెదడులో కొత్త నాడీ సంబంధాలు ఏర్పడతాయి. దీనినే న్యూరో ప్లాస్టిసిటీ అంటారు.