News May 24, 2024

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి సబ్‌మెరైన్ గుర్తింపు

image

రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి సబ్‌మెరైన్‌ సౌత్ చైనా సముద్రంలో బయటపడింది. అమెరికాకు చెందిన ఈ జలాంతర్గామి దాదాపు 80 ఏళ్ల తర్వాత బయటపడటం విశేషం. ఫిలిప్పీన్స్ ఐలాండ్స్ దగ్గర్లో దాదాపు కి.మీ లోతులో అది ఉన్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. కాగా 1944 ఆగస్టు 29న ఈ సబ్‌మెరైన్‌పై శత్రువులు దాడి చేయడంతో సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో అందులో పని చేసే 79 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు.

Similar News

News January 16, 2025

KTR.. ‘గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నావ్: సామ

image

ఫార్ములా కేసులో KTR అవినీతి స్పష్టంగా కన్పిస్తోందని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ఆదేశాలతోనే ఫార్ములా-e వారికి HMDA (గ్రీన్ కో తరపున) డబ్బులు చెల్లించినట్టు ఆధారాలు ఉన్నాయన్నారు. నష్టాల వల్లే గ్రీన్ కో తప్పుకుందన్న KTR.. ఫార్ములా-eకి మొదటి సీజన్ డబ్బు కట్టలేదనే విషయం మాత్రం ఎందుకు దాచారని ప్రశ్నించారు. గ్రీన్ కో’ను ఎందుకు కాపాడుతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

News January 16, 2025

ఎల్లుండి 2 జిల్లాల్లో సీఎం పర్యటన

image

AP: సీఎం చంద్రబాబు ఎల్లుండి రెండు జిల్లాల్లో పర్యటించనున్నారు. శనివారం ఉదయం గుంటూరులో <<15157199>>వాట్సాప్ గవర్నెన్స్ సేవలను<<>>, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటును ప్రారంభిస్తారు. మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లాలో నిర్వహించే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని ఉండవల్లికి తిరిగెళ్తారు. సాయంత్రం తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా‌కు డిన్నర్ ఇవ్వనున్నారు. సీఎం 19న దావోస్ పర్యటనకు బయలుదేరుతారు.

News January 16, 2025

కేటీఆర్‌పై ఈడీ ప్రశ్నల వర్షం

image

TG: ఫార్ములా-ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలుగా ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. HMDA ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఆరా తీస్తున్నారు. అర్వింద్ కుమార్, BLN రెడ్డి వాంగ్మూలాల ఆధారంగా KTRను క్వశ్చన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా మాజీ మంత్రి చెప్పినట్లే తాము చేశామని ఇటీవల ఈడీ విచారణకు హాజరైన అర్వింద్, రెడ్డి చెప్పినట్లు సమాచారం.