News July 1, 2024
ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం భారత్‌లో ఏర్పాటు: కేంద్రమంత్రి

ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియంను వచ్చే ఏడాది భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఇది ఫ్రాన్స్‌లోని లౌవ్రె మ్యూజియం కన్నా రెండింతలు పెద్దగా ఉంటుందని చెప్పారు. ఇదే విషయమై ఫ్రాన్స్‌తో ఒప్పందం జరిగిందని జోధ్‌పుర్‌లో మీడియాతో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేసే ప్రాజెక్టులో పాలుపంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News January 23, 2026
టెక్ మహీంద్రా విస్తరణను వేగవంతం చేయండి: లోకేశ్

AP: టెక్ మహీంద్రా CEO&MD మోహిత్ జోషీతో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. VJAలో టెక్ మహీంద్రా IT క్యాంపస్, విశాఖ విస్తరణ పనులు వేగవంతం చేయాలన్నారు. AI & ML, క్లౌడ్ IOT, సైబర్ సెక్యూరిటీ, ఇండస్ట్రీ 4.0 కోసం స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయాలని సూచించారు. అటు టెక్నాలజీ, డిజిటల్, కన్సల్టింగ్ సేవల్లో ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ&సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతోనూ లోకేశ్ చర్చించారు.
News January 23, 2026
WPL: యూపీపై గుజరాత్ విజయం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్‌పై గుజరాత్ 45 రన్స్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 153/8 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో యూపీ 108 రన్స్‌కే కుప్పకూలింది. GG బౌలర్లలో రాజేశ్వరి 3, రేణుక, సోఫీ చెరో 2, కేశ్వీ, గార్డ్నర్ తలో వికెట్ తీశారు. ఈ ఓటమితో యూపీ ప్లేఆఫ్స్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
News January 23, 2026
ముగిసిన దావోస్ పర్యటన.. రేపు HYDకు చంద్రబాబు

AP CM చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి బయల్దేరారు. నాలుగు రోజుల పర్యటనలో పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పలు కంపెనీల అధిపతులతో భేటీ అయ్యారు. మొత్తం 36కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. రేపు ఉదయానికల్లా ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి అమరావతి వెళ్తారు.


