News April 13, 2024
వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలు కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం జీవించిన(62 ఏళ్ల 202 రోజులు) అవిభక్త మహిళా కవలలు లోరీ, జార్జ్ షాపెల్(డోరీ) కన్నుమూశారు. అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరి మరణానికి కారణాలు తెలియరాలేదు. 1961లో జన్మించిన వీరికి శరీరాలు వేరుగా ఉన్నా.. పుర్రెలు మాత్రం కలిసిపోయాయి. వెన్నుముక సమస్య వల్ల నడక సాధ్యం కాకపోవడంతో వీరు కుర్చీలోనే జీవనాన్ని సాగించారు.
Similar News
News March 4, 2026
ప్రభుత్వ పథకాలు.. అప్లికేషన్ స్టేటస్ ఇక ఈజీగా తెలుసుకోవచ్చు!

TG: సంక్షేమ పథకాల అప్లికేషన్ల స్టేటస్‌ను దరఖాస్తుదారులు ఈజీగా తెలుసుకునేలా ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాన్ని తీసుకొస్తోంది. దీనికోసం ప్రతి విభాగం ఈ-ఆఫీస్ ,డిజిటల్ గవర్నెన్స్‌ను అమలు చేస్తోంది. సీనియర్ IAS జయేష్ రంజన్ అధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ విధానాన్ని రూపొందిస్తోంది. 3 వారాల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. ఆ తర్వాత కొత్త టెక్నాలజీ అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
News March 4, 2026
పైల్స్ అని చూపించినా.. లీవ్ ఇవ్వలేదు!

లక్నో రైల్వే డివిజన్‌లో సిక్ లీవ్ కోసం ఓ లోకో పైలట్ ప్యాంట్ విప్పాల్సి రావడం హాట్ టాపిక్‌గా మారింది. పైల్స్ సర్జరీ చేయించుకున్న రాజేశ్ అనే లోకో పైలట్ రెస్ట్ కోసం లీవ్ అడగ్గా పైఅధికారి రతన్ నమ్మలేదు. తగిన మెడికల్ రిపోర్టులు చూపినా రిజెక్ట్ చేశారు. మనస్తాపంతో రాజేశ్ తన గాయాలను చూపించేందుకు ప్యాంట్ విప్పారు. అయినా అధికారి లీవ్ ఇవ్వడానికి అంగీకరించలేదు. యూనియన్ నాయకుల జోక్యంతో సెలవు మంజూరైంది.
News March 4, 2026
ఇరాన్‌కు షాహెద్.. అమెరికాకు LUCAS.. మరి భారత్‌కు?

ఇరాన్ ‘షాహెద్’, అమెరికా ‘LUCAS’లకు దీటుగా భారత్ శేష్‌నాగ్-150 డ్రోన్‌ను సిద్ధం చేస్తోంది. బెంగళూరులోని NRT సంస్థ అభివృద్ధి చేస్తోన్న ఈ డ్రోన్ 25-40kgల ఆయుధాలతో 1,000km దూరంలోని టార్గెట్స్‌ను రీచ్ అవుతుంది. GPS సిగ్నల్స్ లేని చోట ‘విజువల్ నావిగేషన్’తో పనిచేయడం దీని స్పెషాలిటీ. యుద్ధ క్షేత్రంలో సొంత ఇంటెలిజెన్స్‌తో నిర్ణయాలు తీసుకొని దగ్గర్లోని ఇతర డ్రోన్లతో ఇది కమ్యూనికేట్ చేయగలదు.


