News October 17, 2025
అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్‌ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.
Similar News
News October 18, 2025
ధన త్రయోదశి ఎందుకు జరుపుకొంటారు?

ధంతేరస్‌ను జరుపుకోవడానికి ప్రధాన కారణం.. ఈ రోజున ఆరోగ్య ప్రదాత ధన్వంతరి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించడం. ఈ పండుగను దీపావళికి శుభారంభంగా పరిగణిస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజించడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతాయి. నూతన పెట్టుబడులకు, విలువైన వస్తువుల కొనుగోలుకు ఇది శుభ సమయం. అలాగే ఇల్లు, మనస్సులను శుద్ధి చేసుకొని పండుగకు సిద్ధపడడం ద్వారా ఆనందం, అదృష్టం లభిస్తాయని ఈ పండుగ తెలియజేస్తుంది.
News October 18, 2025
PM జన్‌మన్ అమలులో TGకి మూడో ర్యాంక్

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(PM JANMAN) అమలులో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన ‘ఆది కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. గిరిజన సమూహాల సమాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు కేంద్రం 2023 నవంబర్‌లో ఈ పథకం ప్రారంభించింది.
News October 18, 2025
నేడు ఇలా చేస్తే సకల శుభాలు

నేడు ధన త్రయోదశి పర్వదినం. ఈరోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ‘ఈ శుభ దినాన బంగారం, వెండి, లోహ పాత్రలు, కొత్తిమీర, కొత్త చీపురు కొనడం శుభప్రదం. ప్రధాన ద్వారం వద్ద యముడికి దీపాన్ని దానం చేయడం ద్వారా అకాల మృత్యు భయం తొలగుతుంది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం లభించి, సంపద వర్షిస్తుంది’ అని పేర్కొంటున్నారు.