News March 28, 2024
ఘోరం.. పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదని పొడిచేశారు

మహారాష్ట్రలోని భివండీలో దారుణ ఘటన జరిగింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలో ఆన్సర్ షీట్ చూపించలేదనే కారణంతో ఓ విద్యార్థిపై ముగ్గురు క్లాస్మేట్స్ దాడి చేశారు. తర్వాత కత్తితో పొడిచేశారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 9, 2026
నాడు KCRను ఓడించాలనుకొని.. నేడు ఆయన బాటలోకి!

ఒకనాటి ప్రత్యర్థులను త్వరలో మిత్రులుగా చూడబోతున్నాం. 2008 కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికలో పోటీపడ్డ KCR, <<19608778>>జీవన్ రెడ్డి<<>> ఒకే పార్టీలో కనిపించనున్నారు. ఆ ఎలక్షన్స్‌లో TRS అధినేతకు ఆయన గట్టిపోటీ ఇచ్చారు. KCRకు 2,69,452 ఓట్లు, జీవన్ రెడ్డికి 2,53,687 ఓట్లు వచ్చాయి. TG రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ స్పష్టమైన నిర్ణయం తీసుకోవట్లేదని ప్రజాభిప్రాయ నిరూపణకు MPగా ఉన్న KCR రిజైన్ చేయడంతో ఉపఎన్నిక జరిగింది.
News April 9, 2026
ఈ ఆలయాల్లోకి పురుషులకు నో ఎంట్రీ

శబరిమలలో మహిళలకు ఎంట్రీ నిషేధంపై కేసు విచారణ సందర్భంగా 7 ఆలయాల్లో పురుషులకూ అనుమతి లేదని కేంద్రం SCకి చెప్పింది. కొన్ని సందర్భాల్లో వీటిలోకి పురుషులకు ప్రవేశం ఉండదు. అట్టుకల్ భగవతీ టెంపుల్, చక్కులతుకవు టెంపుల్, కొట్టన్కులంగరా శ్రీదేవి టెంపుల్-కేరళం, బ్రహ్మ టెంపుల్-రాజస్థాన్, భగవతి అమ్మన్ టెంపుల్-కన్యాకుమారి(తమిళనాడు), మాతా టెంపుల్-ముజఫర్‌పూర్(బిహార్), కామాఖ్య టెంపుల్-అస్సాం.
News April 9, 2026
మూడు నెలల్లో చనిపోతావన్నారు: యువరాజ్

IND మాజీ క్రికెటర్ యువరాజ్ క్యాన్సర్ పోరాటంపై తన అనుభవాలను ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నారు. ఆరోగ్యం క్షీణిస్తున్నా లెక్కచేయకుండా పట్టుదలతో ఆడానని కానీ క్రమంగా పరిస్థితి విషమించిందన్నారు. కీమోథెరపీ మొదలుపెట్టకపోతే 3-6 నెలల్లో చనిపోతానని డాక్టర్లు హెచ్చరించగా తన పరిస్థితి అర్థమై చికిత్స తీసుకున్నానని తెలిపారు. కాగా 2011 WC టైమ్‌కే క్యాన్సర్ లక్షణాలు కనిపించినా యువీ వాటిని తట్టుకొని జట్టు కోసం ఆడారు.


