News April 14, 2025
చెత్త ప్రదర్శన.. అయినా తగ్గని CSK క్రేజ్

IPL: చెన్నై ఈ ఏడాది చెత్త ప్రదర్శనతో వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్న విషయం తెలిసిందే. ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా గత మ్యాచ్లో ఫలితం మారలేదు. అయినా SMలో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. లక్నోలో ఇవాళ LSG, CSK మ్యాచ్ సందర్భంగా సోషల్ మీడియా బజ్పై స్టార్ స్పోర్ట్స్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇందులో 84% చెన్నైకి, 16% లక్నోకు సపోర్ట్ చేస్తున్నట్లు తేలింది. ఇవాళ గెలుపుపై చెన్నై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
Similar News
News December 18, 2025
NLG: ముగిసిన పల్లె సంగ్రామం

నల్గొండ జిల్లాలో గ్రామీణ సంగ్రామం ముగిసింది. నెల రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ నిన్నటితో పరిసమాప్తం అయింది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సహకరించిన వారందరికి కలెక్టర్ ఇలా త్రిపాఠి ధన్యవాదాలు తెలిపారు.
News December 18, 2025
తెలుగు రాష్ట్రాల్లో సీఈసీ పర్యటన

CEC జ్ఞానేశ్ కుమార్ 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు 12PMకు HYD చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి శ్రీశైలం వెళతారు. 20న మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 21న HYD రవీంద్ర భారతి ఆడిటోరియంలో TG BLOలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తారు. కాగా ఈ పర్యటనలో ఆయన గోల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.
News December 18, 2025
హైవేలపై QR కోడ్స్.. ఎందుకంటే?

నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు NHAI టెక్నాలజీని వాడనుంది. ఇందులో భాగంగా రోడ్డు పక్కన QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు-నెలమంగళ (NH-48), బెంగళూరు-కోలార్-ముల్బాగల్ (NH-75) మార్గాల్లో అందుబాటులోకి తెచ్చింది. QR కోడ్ స్కాన్ చేస్తే ప్రాజెక్ట్ వివరాలు, దగ్గరున్న టోల్ & ఫీజు, సౌకర్యాలు & అత్యవసర సేవల గురించి తెలుస్తుంది.


