News March 25, 2025
IPL: మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు

ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు(19) సున్నాకే వెనుదిరిగిన ప్లేయర్‌గా ఆయన నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(18), దినేశ్ కార్తీక్(18), పియూశ్ చావ్లా(16), సునీల్ నరైన్(16) ఉన్నారు.
Similar News
News February 3, 2026
అడుగులోనే అరక విరిగిందట

పొలం దున్నడానికి ఉపయోగించే ముఖ్యమైన వ్యవసాయ పనిముట్టు అరక. పొలం దున్నడం మొదలుపెట్టి, ఒక అడుగు వేయకముందే లేదా మొదటి అడుగులోనే, ప్రధానమైన పనిముట్టు అయిన అరక విరిగిపోతే పని ముందుకు సాగదు. ఏదైనా ఒక కార్యాన్ని లేదా ప్రయత్నాన్ని ప్రారంభించిన తక్షణమే ఊహించని సమస్య లేదా అవాంతరం ఎదురై మొత్తం ప్రణాళిక లేదా ప్రయత్నం విఫలమైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు.
News February 3, 2026
ఇంట్లో పెద్ద విగ్రహాలు ఉన్నాయా?

ఇంట్లో అంగుళం కన్న పెద్ద విగ్రహాలు ఉండకూడదు. ఉంటే నిత్య పూజలు చేయాలి. ఎందుకంటే పెద్ద విగ్రహాలకు చాలా ఆకర్షణ శక్తి ఉంటుంది. దాన్ని ఇల్లు భరించలేదు. అలాగే దైవారాధనకు సగుణ, నిర్గుణ అనే 2 మార్గాలున్నాయి. అందులో విగ్రహ పూజ సగుణోపాసన. దీనికి కొన్ని నియమాలుంటాయి. దాని ప్రకారం అంగుళం కన్నా పెద్ద విగ్రహం ఇంట్లో ఉంటే కఠిన నియమాలతో నిత్య పూజలు తప్పక చేయాలి. లేనిపక్షంలో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.
News February 3, 2026
మెగాస్టార్ మూవీలో మోహన్‌లాల్!

మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ మరోసారి తెలుగు స్ట్రెయిట్ మూవీలో నటించనున్నట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ మూవీ తెరకెక్కనుంది. ‘మెగా 158’ వర్కింగ్ టైటిల్. ఈ నెలలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. దీనిలో మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తారని సమాచారం. ఇప్పటికే మూవీ టీమ్ ఆయనతో సంప్రదింపులు పూర్తి చేసిందట. గతంలో ఆయన ‘జనతా గ్యారేజ్’లో నటించారు.


