News July 7, 2024
భారత జట్టు చెత్త రికార్డు

జింబాబ్వే చేతిలో ఓడిన భారత యువ క్రికెట్ జట్టు ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఎనిమిదేళ్లలో టీమ్ ఇండియా ఆలౌట్ అయిన అత్యల్ప స్కోరు(102) ఇదే. చివరిసారిగా 2016లో 101 పరుగులకే(vsSL) అన్ని వికెట్లు కోల్పోయింది. అంతకుముందు 2015లో 92(vsSA), 2016లో 79(vsNZ), 2008లో 74(vsAUS) స్కోరుకు భారత్ ఆలౌట్ అయ్యింది.
Similar News
News November 23, 2025
ఖమ్మం: టెక్నికల్ కోర్సు పరీక్ష ఫీజు గడువు డిసెంబర్ 5

2026 విద్యా సంవత్సరంలో నిర్వహించే టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ) పరీక్షల ఫీజును డిసెంబర్ 5వ తేదీలోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్యజైని శనివారం తెలిపారు. పరీక్ష రుసుము రూ.100గా నిర్ణయించారు. అపరాధ రుసుముతో గడువును పెంచారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 12 వరకు, రూ.75 అపరాధ రుసుముతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చని ఆమె వివరించారు.
News November 23, 2025
రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గ్లోబల్ సమ్మిట్

DEC 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో TG ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్కు 2వేల మంది ప్రముఖులు రానున్నారు. రాష్ట్ర లక్ష్యాలు, ప్రణాళికలు వివరించేలా ప్రభుత్వం ‘TG రైజింగ్-2047’ డాక్యుమెంట్ను రూపొందించి ఆవిష్కరించనుంది. ఈ నెల 25 నుంచి CM రేవంత్ వివిధ శాఖలతో సమీక్షించి డాక్యుమెంట్కు తుది మెరుగులు దిద్దనున్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచడం, భారీగా పెట్టుబడులను ఆకర్షించడం దీని లక్ష్యం.
News November 23, 2025
మూర్ఛ జన్యుపరమైన సమస్య

ఫిట్స్ ఒక దీర్ఘకాలిక రుగ్మత. దాదాపు 70% మూర్ఛ కేసులు జన్యుపరమైన కారణాలతో సంబంధం కలిగి ఉంటాయని వారు పేర్కొంటున్నారు. 2018లో ‘Neuron’ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 622 మంది మూర్ఛ రోగుల DNAను అధ్యయనం చేయగా వారిలో మూర్ఛ వ్యాధికి కారణమయ్యే 19 కొత్త జన్యువులను పరిశోధకులు గుర్తించారట. ఈ జన్యు మార్పులు మెదడు కణాల మధ్య సంకర్షణను దెబ్బతీస్తాయని, ఫలితంగా మూర్ఛ వస్తుందని నిపుణులు గుర్తించారు.


