News December 9, 2024
రోహిత్ శర్మ ఖాతాలో చెత్త రికార్డ్

అడిలైడ్ టెస్టు ఓటమితో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును సమం చేశారు. టెస్టుల్లో వరుసగా 4 పరాజయాలు చవిచూసిన మూడో కెప్టెన్గా.. ధోనీ, కోహ్లీ, దత్తా గైక్వాడ్ సరసన రోహిత్ నిలిచారు. టెస్టుల్లో అత్యధిక వరుస ఓటములు చవిచూసిన కెప్టెన్ల జాబితాలో మన్సూర్ అలీఖాన్ పటౌడి (6), సచిన్(5) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టీమ్ఇండియా స్వదేశంలో రోహిత్ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే.
Similar News
News November 22, 2025
కృష్ణా: చోరీ అనుమానితుల ఫొటోలు విడుదల..!

మచిలీపట్నం మాచవరం సమీపంలోని పాత తౌడు ఫ్యాక్టరీ వద్ద రెండు రోజుల కిందట రెండు ఇళ్లలోకి చోరీకి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. వీరు ఎక్కడ కనిపించినా వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ 8332983789కు సమాచారం ఇవ్వాలని చిలకలపూడి సీఐ కోరారు. వీరిద్దరూ బైక్పై తిరుగుతుంటారని తెలిపారు.
News November 22, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.
News November 22, 2025
విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.


