News September 3, 2024
WOW: అయోధ్య మందిరంలో బాలాపూర్ గణేశుడు!
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా బాలాపూర్ గణేశుడు ఈసారి మరింత ప్రత్యేకంగా దర్శనమివ్వనున్నాడు. ప్రతి ఏటా ప్రముఖ పుణ్యక్షేత్రాల థీమ్‌తో డెకరేషన్ చేస్తారు. 2023లో బెజవాడ దుర్గమ్మ గుడి సెట్టింగ్ వేశారు. ఈ ఏడాది అయోధ్య బాల రాముడి ఆలయ ఆకారంలో మండపం నిర్మిస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సీనియర్ డెకరేటర్ సుధాకర్ రెడ్డి ఈ సెట్టింగ్ వేస్తున్నారు. భక్తులకు మరింత కనువిందుగా మండప నిర్మాణం ఉంటుందన్నారు.
Similar News
News September 17, 2024
బాలాపూర్ లడ్డూ.. 30 ఏళ్లలో ఆమె ఒక్కరే..!
HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్కంఠ నడుమ కొనసాగుతుంది. అయితే ప్రతిసారి ఇందులో పురుషులే పాల్గొంటూ ఉంటారు. కానీ 2009లో మాత్రం సరిత అనే మహిళ వేలంలో పాల్గొని రూ.5,10,000కు లడ్డూ కైవసం చేసుకుని సత్తా చాటారు. 1994 నుంచి 2024 వరకు 30 ఏళ్లలో బాలాపూర్ లడ్డూ కొన్న ఒకే ఒక్క మహిళగా సరిత నిలిచారు. ఈసారి రూ.30,01,000కు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూ దక్కించుకున్న విషయం తెలిసిందే.
News September 17, 2024
బాలాపూర్ లడ్డూ స్పెషల్.. ఒక్కరే ఐదు సార్లు..!
HYD బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలం తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. కాగా 1994లో ఈ వేలం ప్రారంభమవగా తొలిసారి కొలన్ మోహన్ రెడ్డి రూ.450కి లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం ఆయనే 1995లో రూ.4,500, 1998లో రూ.51,000, 2004లో రూ.2,01,000, 2008లో రూ.5,07,000 వేలం పాడి ఐదు సార్లు లడ్డూ కైవసం చేసుకున్నారు. గత 30 ఏళ్లలో ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. SHARE IT
News September 17, 2024
దద్దరిల్లుతున్న హైదరాబాద్
వినాయక నిమజ్జనాలు, భారీ జులూస్‌లతో హైదరాబాద్ దద్దరిల్లుతోంది. వేలాది విగ్రహాలు ట్యాంక్‌బండ్‌కు క్యూ కట్టాయి. మరికాసేపట్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి భారీ శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కళాకారుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, LED లైట్ల నడుమ యువత కేరింతలు కొడుతున్నారు. ‘జై బోలో గణేశ్ మహరాజ్‌కి జై’ నినాదంతో HYD హోరెత్తింది.