News August 18, 2024

WOW.. పేరుపాలెం బీచ్‌లో ‘సండే సందడి’

image

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో సందడిగా కనిపించింది. సెలవు రోజు కావడంతో దూరప్రాంతాల నుంచి సైతం చాలామంది సముద్ర స్నానాలకు వచ్చారు. కొబ్బరి తోటలలో విందుల చేసుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. సాగర తీరం అలలతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచింది.

Similar News

News November 7, 2025

భీమవరం: క్యాన్సర్ అవగాహన దినోత్సవ ర్యాలీ

image

ముందస్తు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా వ్యాధిని నూరు శాతం నిరోధించవచ్చని కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం ప్రకాశం చౌక్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే, వ్యాధి నుంచి కోలుకునే అవకాశం గణనీయంగా పెరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే రామాంజనేయులు, ఎస్పీ నయీం అస్మీ పాల్గొన్నారు.

News November 7, 2025

జావెలిన్ త్రోలో కొంతేరు కుర్రాడి సత్తా

image

యలమంచిలి(M) కొంతేరు ZPHS 9వ తరగతి విద్యార్థి పెదపూడి అరుణ్ కుమార్ అండర్-17 బాలుర జావెలిన్ త్రో విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెచ్‌ఎం డి. రాంబాబు తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెదవేగిలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో అరుణ్ కుమార్ 42 మీటర్లు జావెలిన్ విసిరి ప్రథమ స్థానం సాధించాడు. ఈ నెల 22న వినుకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో అరుణ్ జిల్లాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

News November 7, 2025

ప.గో: మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీలు

image

ప.గో జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లోని డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పరిస్థితిని తెలుసుకునేందుకు జిల్లా యంత్రాంగం గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. కలెక్టర్ చదలవాడ నాగరాణి సహా 141 మంది అధికారులు 141 పాఠశాలల్లో పరిశీలించారు. ఇటీవల కాళ్లలో కుళ్లిన కోడిగుడ్లు బయటపడటంతో అధికారులు గుడ్లను నిశితంగా పరిశీలించారు. జిల్లాలో సుమారు 80 వేల మంది విద్యార్థులకు భోజనం అందుతోందని అధికారులు తెలిపారు.