News August 18, 2024
WOW.. పేరుపాలెం బీచ్‌లో ‘సండే సందడి’
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలోని పేరుపాలెం సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో సందడిగా కనిపించింది. సెలవు రోజు కావడంతో దూరప్రాంతాల నుంచి సైతం చాలామంది సముద్ర స్నానాలకు వచ్చారు. కొబ్బరి తోటలలో విందుల చేసుకొని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. సాగర తీరం అలలతో పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచింది.
Similar News
News September 19, 2024
రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన ఉద్యాన వర్సిటీ వీసీ
తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్ డా.గోపాల్ బుధవారం రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, సాధించిన పురోగతిని గవర్నర్‌కు వివరించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ డా.శ్రీనివాసులు ఉన్నారు.
News September 19, 2024
చంద్రబాబును కలిసిన జడ్పీ ఛైర్‌పర్సన్ దంపతులు
అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ దంపతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం చంద్రబాబుకు పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో వారు టీడీపీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు.
News September 18, 2024
పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడు ఇతనే
పేరుపాలెం బీచ్‌లో ఓ యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. వివరాలు.. భీమవరం పట్టణం మెంటేవారితోటకు చెందిన రాజు, రత్న దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు ప్రభు చరణ్ బర్త్‌డే సందర్భంగా తమ్ముడు ప్రవీణ్ కుమార్, స్నేహితులతో కలిసి బీచ్ వెళ్లారు. ఈ క్రమంలో బీచ్‌లో స్నానం చేస్తుండగా ప్రవీణ్ గల్లంతయ్యాడు. అంతకు ముందు గణేశ్ ఉత్సవాల్లోనూ పాల్గొన్నాడని అంతలోనే ఇలా అయిందని కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.