News December 31, 2024
WOW.. వెల్గటూర్: Way2News కెమెరాకు చిక్కిన ప్రకృతి అందాలు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ముంపునకు గురైన తాళ్ల కొత్తపేట గ్రామంలోని ప్రకృతి అందాలు “Way2News” కెమెరాకు చిక్కాయి. గ్రామంలోని గోదావరి నది తీరంలో అరుదైన కొంగలు కనువిందు చేశాయి. ఇలాంటి ప్రకృతి అందాలు చూసిన గ్రామస్థులు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రకృతి అందాలు ఆస్వాదించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.
Similar News
News December 23, 2025
REWIND: కరీంనగర్: రాజకీయ రణక్షేత్రం..!

ఈ ఏడాది జిల్లాలో రాజకీయ వేడి ఏమాత్రం తగ్గలేదు. సంవత్సరం ఆరంభంలో జరిగిన MLC ఎన్నికల్లో హోరాహోరీ పోరు నడిచింది. చివరికి మేధావులు బీజేపీకి పట్టం కట్టారు. ఈ నెలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు పల్లెల్లో సెగ పుట్టించాయి. ఈ ఎన్నికలు రాబోయే రాజకీయ పరిణామాలకు దిక్సూచిలా మారాయి. అధికార పార్టీకి గట్టి పోటీనిస్తూ BRS, BJPలు పోటాపోటీగా సీట్లు గెలుచుకోవడం జిల్లా రాజకీయాల్లో వేడిని పెంచింది.
News December 23, 2025
కరీంనగర్: ప్రాణదాతగా ‘108’ అంబులెన్స్ సేవలు

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ‘108’ అంబులెన్స్ సేవలు ప్రాణదాతగా నిలుస్తున్నాయి. ప్రమాదాలు, గర్భిణీలను ఆసుపత్రులకు చేర్చడం, తదితర సేవలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. KNR జిల్లాలో ప్రస్తుతం 16 అంబులెన్సులు, 33మంది ఈఎంటీలు, 35 మంది పైలట్లు నిరంతరం అందుబాటులో ఉండి విధులు నిర్వహిస్తున్నారు. గత 20 నెలల కాలంలోనే జిల్లా వ్యాప్తంగా 56,171 మంది బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలను కాపాడటం విశేషం.