News March 14, 2025
WOW.. గ్రూప్స్‌లో సత్తాచాటిన సిద్దిపేట బ్రదర్స్

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతుల కొడుకులు వెంకటేశ్, హరికృష్ణలు ఇటీవల విడుదలైన గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల్లో సత్తా చాటారు. పెద్ద కుమారుడు వెంకటేశ్ గ్రూప్ -1లో 466 మార్కులు సాధించారు. ర్యాంక్స్ వెల్లడించాల్సి ఉండగా ప్రస్తుతం ఆయన పాల్వంచ కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్కో ఏఈగా పనిచేస్తున్నాడు. చిన్నోడు హరికృష్ణ గ్రూప్-2లో 184 ర్యాంక్ సాధించారు.
Similar News
News March 14, 2025
SKLM: పలాసలో 23న స్వాతంత్ర్య సమరయోధుల సంస్మరణ సభ

పలాస మండలం మా కన్నపల్లి గ్రామంలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ దేవ్‌ల సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రజలు అందరూ పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
News March 14, 2025
Life Time High: భారీగా పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు కనీవినీ ఎరుగని స్థాయికి చేరుకుంటున్నాయి. తొలిసారిగా నేడు ఔన్స్ (28.35గ్రా) విలువ $3002ను టచ్ చేసింది. ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేసిన $3000 రెసిస్టెన్సీని బ్రేక్ చేసింది. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్, డాలర్ తగ్గుదల, ట్రేడ్‌వార్, అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్లు గోల్డులో పెట్టుబడి పెట్టడమే ఇందుకు కారణాలు. ప్రస్తుతం HYDలో 24K 10Gr ధర నిన్నటితో పోలిస్తే రూ.1200 పెరిగి రూ.₹89,780 వద్ద ఉంది.
News March 14, 2025
హనుమకొండ: చెడుపై విజయమే హోలీ: కలెక్టర్

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చెడుపై విజయమే హోలీ అర్థం అన్నారు. ఈ పర్వదినం ప్రజల జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.