News June 14, 2024

WOW.. వాట్సాప్‌‌లో 3 అదిరిపోయే ఫీచర్స్

image

వాట్సాప్‌ కాల్స్‌లో మరో మూడు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. దీనితో ఒకేసారి 32 మంది స్నేహితులతో వీడియో కాల్‌ మాట్లాడొచ్చు. ఇప్పటి వరకూ ఉన్న స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ఇకపై ఆడియోతో అందుబాటులోకి వస్తుంది. మెరుగైన ఆడియో, వీడియో నాణ్యతను అందించేందుకు MLow కోడెక్‌ ఫీచర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది వాయిస్ క్లారిటీతో పాటు HDలో వీడియో కాల్ మాట్లాడే సదుపాయాన్ని అందిస్తుంది.

Similar News

News November 24, 2025

ఇక సెలవు.. ధర్మేంద్ర అంత్యక్రియలు పూర్తి

image

బాలీవుడ్ నటుడు <<18374925>>ధర్మేంద్ర<<>> (89) అంత్యక్రియలు ముగిశాయి. తొలుత ఆయన పార్థివ దేహాన్ని ముంబైలోని పవన్ హన్స్ శ్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఆయన్ను కడసారి చూసేందుకు సినీతారలు, అభిమానులు భారీగా వచ్చారు. అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సంజయ్ దత్ తదితర సినీ తారలు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు తుది నివాళులు అర్పించారు.

News November 24, 2025

అది మీ తప్పు కాదు

image

ప్రేమలో విఫలం అయిన తర్వాత చాలామంది తమ లోపాల వల్లే అలా అయిందని బాధపడుతుంటారు. ఇలాంటి ప్రతికూల ఆలోచనలు డిప్రెషన్‌కు కారణమవుతాయంటున్నారు నిపుణులు. వాళ్ల ఆలోచనలు, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకోవడం సరికాదు. సానుకూల దృక్పథం, స్వీయ ప్రేమను అలవర్చుకొని జీవితంలో ముందుకు సాగాలి. ఎంత ప్రయత్నించినా బాధ నుంచి బయటపడలేకపోతుంటే మానసిక నిపుణులను సంప్రదించడం మంచిది.

News November 24, 2025

ముగిసిన ఐబొమ్మ‌ రవి విచారణ.. కీలక విషయాలు వెలుగులోకి!

image

మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవి 5 రోజుల పోలీసు విచారణ ముగిసింది. స్నేహితుడు నిఖిల్‌తో కలిసి రవి డేటా హ్యాండ్లింగ్, సర్వర్ యాక్సెస్ వంటి అంశాల్లో పాల్గొన్నట్లుగా సమాచారం. టెలిగ్రామ్ యాప్ ద్వారా పైరసీ సినిమాల కొనుగోలు, USDT చెల్లింపులు, APK లింక్స్‌తో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది. విచారణ ముగిశాక రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.