News August 12, 2025
WOW.. మూడు రోజుల్లో 343L పాలిచ్చిన ఆవు

బ్రెజిల్‌కు చెందిన హోల్‌స్టెయిన్-ఫ్రైసియన్ జాతి ఆవు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. సాధారణ ఆవులు రోజుకు 10 లీటర్ల పాలు ఇస్తుంటే ఇది మాత్రం సగటున రోజుకు 114 లీటర్ల చొప్పున 3 రోజుల్లో 343L పాలు ఉత్పత్తి చేసింది. జెనెటిక్స్, సరైన పోషణ, సంరక్షణ, మోడ్రన్ డెయిరీ టెక్నాలజీ వల్ల ఇది సాధ్యమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముర్రా & నీలి-రవి గేదెలు కూడా ఈ జాతిలానే ఎక్కువ పాలు ఇవ్వగలవు.
Similar News
News August 13, 2025
రాష్ట్రమంతటా రెండు రోజులు రెడ్ అలర్ట్

TG: రాష్ట్రమంతటికీ ఇవాళ, రేపు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. MUL, భద్రాద్రి, BPL, KMM, యాదాద్రి, మల్కాజ్‌గిరి, MDK, VKB, సంగారెడ్డి జిల్లాలకు రెడ్ కలర్ వార్నింగ్ జారీ చేశామన్నారు. HYD, HNK, ADB, JNG, కామారెడ్డి, ASF, MHBD, MNCL, రంగారెడ్డి, NLG, SDP, WGL జిల్లాలకు ఆరెంజ్, నిర్మల్, NZB, JGL, SRCL, PDP, KNR జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.
News August 13, 2025
‘కూలీ’కి తొలిరోజే రూ.వంద కోట్లు: సినీవర్గాలు

రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ‘కూలీ’ సినిమా విడుదలైన తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీవర్గాలు అంచనా వేశాయి. తొలి వీకెండ్‌కు ప్రీసేల్స్‌తోనే ఈ చిత్రానికి రూ.110 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ జరిగిందని తెలిపాయి. ఇప్పటికే నార్త్ అమెరికాలో $2M క్రాస్ చేయడాన్ని గుర్తుచేస్తున్నాయి. రేపటి వరకూ బుకింగ్స్, డైరెక్ట్ సేల్స్ ద్వారా తొలిరోజు రూ.వంద కోట్లు రావొచ్చని పేర్కొంటున్నాయి.
News August 13, 2025
అతి భారీ వర్షాలు.. అవసరమైతేనే బయటకు వెళ్లండి

హైదరాబాద్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ముఖ్యంగా నార్త్ GHMC ఏరియాలో 20 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని హెచ్చరించింది. ఈక్రమంలో అవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.